వద్దన్న రాష్ట్రాల్లో రైళ్లు ఆగవు

ABN , First Publish Date - 2020-06-05T07:44:32+05:30 IST

ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్ల (స్టాపేజీ)ను రైల్వేశాఖ కుదించింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ డబ్బులను తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఇటీవల ప్రత్యేక రైళ్లను వేసిన నేపథ్యంలో కరోనాపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్టాపేజీలను కుదించాలని కేంద్రానికి వివిధ రాష్ట్రాలు విజ్ఞప్తి...

వద్దన్న రాష్ట్రాల్లో రైళ్లు ఆగవు

  • టికెట్‌ సొమ్ము రిఫండ్‌ 


న్యూఢిల్లీ, జూన్‌ 4: ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్ల (స్టాపేజీ)ను  రైల్వేశాఖ కుదించింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ డబ్బులను తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. ఇటీవల ప్రత్యేక రైళ్లను వేసిన నేపథ్యంలో కరోనాపై ఆందోళన వ్యక్తం చేస్తూ స్టాపేజీలను కుదించాలని కేంద్రానికి వివిధ రాష్ట్రాలు విజ్ఞప్తి చేశాయి! ఈ మేరకు సదరు స్టేషన్లకు సంబంధించిన ప్రయాణికుల టికెట్లు ఆటోమేటిక్‌గా రద్దవుతాయని, ఆ తాలూకు డబ్బు క్యాన్సలేషన్‌ చార్జీలేవీ లేకుండా రిఫండ్‌ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. లాక్‌డౌన్‌ కాలంలో టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులకు కోతలేమీ విధించకుండా రూ.1885 కోట్ల మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది.  


Updated Date - 2020-06-05T07:44:32+05:30 IST