Transgenders agitation: బ్రాంచ్ మేనేజర్‌ను బయటికి లాగి.. రోడ్డుపై డ్యాన్స్ చేసిన హిజ్రాలు.. మద్దతుగా నిలిచిన స్థానికులు.. ఇంతకీ సమస్య ఏంటంటే..
ABN , First Publish Date - 2022-08-27T00:33:12+05:30 IST
హిజ్రాలు (Transgender) గుంపులు గుంపులుగా రోడ్డు పైకి వచ్చి ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. అంతా చూస్తుండగానే ఓ బ్యాంచ్ మేనేజర్‌ను బయటికి లాగి, రోడ్డుపై డ్యాన్స్..
హిజ్రాలు (Transgender) గుంపులు గుంపులుగా రోడ్డు పైకి వచ్చి ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. అంతా చూస్తుండగానే ఓ బ్యాంచ్ మేనేజర్‌ను బయటికి లాగి, రోడ్డుపై డ్యాన్స్ చేశారు. మేనేజర్‌పై చీర కొంగు కప్పుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమస్య తెలుసుకున్న స్థానికులు వారికి మద్దతుగా నిలిచారు. చివరకు పోలీసులు కలుగజేసుకోవడంతో సమస్య సర్దుమణిగింది. తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనకు సబంధించిన వివరాల్లోకి వెళితే..
బీహార్ (Bihar) రాష్ట్రం ముజఫర్‌పూర్‌లో (Muzaffarpur) ఉన్న సహారా ఇండియా సంస్థ బ్రాంచ్ వద్దకు శుక్రవారం హిజ్రాలు గుంపులు గుంపులుగా చేరుకున్నారు. రోడ్డుపై రాకపోకలను అడ్డుకుని, నడి రోడ్డుపై అర్ధనగ్నంగా డ్యాన్స్ చేశారు. చివరకు బ్యాంచ్ మేనేజర్‌ను బయటికి లాగారు. అతడి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. స్థానికులు పెద్ద ఎత్తున గుమికూడారు. చివరకు విషయం తెలుసుకుని అంతా కలిసి వారికి మద్దతుగా నిలిచారు. ఆందోళన కారణంగా ట్రాఫిక్ సుమారు మూడు గంటల పాటు స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకుని హిజ్రాలతో మాట్లాడి సమస్య తెలుసుకున్నారు.
పర్సు కొట్టేస్తూ దొరికిపోయిన కుర్రాడు.. చితకబాదాక ఎందుకీ పని చేశావని నిలదీస్తే అతడు చెప్పింది విని నివ్వెరపోయిన జనం
సహారా ఇండియా స్కీమ్‌కు (Sahara India Scheme) సంబంధించి ఏజెంట్ల ద్వారా వివిధ రూపాల్లో డిపాజిట్లు (Deposits) సేకరించారు. ఈ క్రమంలో ఖాతాదారులకు చెల్లించాల్సిన కోట్ల రూపాయల నగదుకు సంబంధించిన కేసు కోర్టులో (Court case) ఉన్న విషయం తెలిసందే. అయితే ఇందులో చాలామందికి మెచ్యూరిటీ సమయం దాటినప్పటికీ చెల్లింపులు చెయ్యకపోవటంతో పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ముజఫర్‌పూర్‌లో ఉన్న బ్యాంచ్‌లో కూడా చాలా మంది ఖాతాదారులకు పెద్ద మొత్తంలో డబ్బులు అందాల్సి ఉంది.
యాక్సిడెంట్ వల్ల రెండు కాళ్లు విరిగి మంచాన పడిన భర్త.. మూడేళ్ల తర్వాత మామను చంపించిన కోడలు.. అసలు కథేంటంటే..
అలాగే వందలో సంఖ్యలో హిజ్రాలు పదేళ్లుగా ఈ బ్యాంచ్‌లో నగదు జమ చేస్తున్నారు. వారికి రావాల్సిన డబ్బుల విషయంలో చాలా రోజులుగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆందోళనకు దిగారు. తాము డిపాజిట్ చేసిన డబ్బుకు తక్షణమే వడ్డీతో పాటు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై బ్యాంచ్ మేనేజర్ సంజయ్ కుమార్ ఝా మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం చాలా మంది తమ బ్రాంచ్‌లో నగదు జమ చేశారని, 2021లోనే వారికి తిరిగి చెల్లించాల్సి ఉందన్నారు. అయితే కోర్టులో కేసు నడుస్తున్నందున చెల్లించలేదని తెలిపారు. 2022 చివరికల్లా అందరికీ డబ్బులు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో చివరికి హిజ్రాలు శాంతించారు.