కరోనా ఆసుపత్రుల్లో ఇకపై ఇతర రోగులకూ చికిత్స!
ABN , First Publish Date - 2021-02-02T17:55:41+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి.
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో గతంలో కరోనా బాధితుల కోసం కేటాయించిన ఆసుపత్రులలో ఇకపై సాధారణ రోగులకు కూడా వైద్య సేవలు అందించనున్నారు. ఈ క్రమంలో ముందుగా కాన్పూర్ జిల్లా ఆసుపత్రిలో సామాన్య బాధితులకు కూడా వైద్య సేవలు అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా జిల్లాలలోని కోవిడ్ ఆసుపత్రులలో ఇకపై ఇతర రోగులకు కూడా వైద్య పరీక్షలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 3 నుంచి అన్ని కరోనా ఆసుపత్రులలో ఇకపై సాధారణ రోగులకు కూడా చికిత్సలు అందించనున్నారు.