మొక్కలు నాటడం ప్రకృతిని ప్రేమించడమే: పృధ్వీరాజ్
ABN , First Publish Date - 2021-04-11T06:39:23+05:30 IST
మొక్కలు సేకరించి వాటిని సంరక్షించడం కూడా ప్రకృతిని ప్రేమించడమేనని ప్రముఖ సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు.
కొత్తపేట, ఏప్రిల్ 10: మొక్కలు సేకరించి వాటిని సంరక్షించడం కూడా ప్రకృతిని ప్రేమించడమేనని ప్రముఖ సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. స్థానిక పరిసర ప్రాంతంలో శనివారం ఆయన ‘ఈ క్షణం ఒకవరమై..’ చిత్రం షూటింగ్‌లో పాల్గొని తన స్నేహితుడైన కొత్తపేటకు చెందిన పెద్దింటి రామం ఇంటికి విచ్చేశారు. ఈసం దర్భంగా సేకరించిన 270రకాల మొక్కలను రామం చూపించారు. ఈసందర్భంగా పృథ్వీరాజ్ రామాన్ని అభినందించారు. ఆయన వెంట ఈచిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్న గిరి పాల్గొన్నారు.