Arunachalలో మళ్లీ తలపడిన ఇండియా, చైనా

ABN , First Publish Date - 2021-10-08T16:00:37+05:30 IST

అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌ యాంగ్సే సమీపంలో భారత, చైనా ..బలగాలు మళ్లీ

Arunachalలో మళ్లీ తలపడిన ఇండియా, చైనా

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌ యాంగ్సే సమీపంలో భారత, చైనా బలగాలు మళ్లీ తలపడ్డాయి. ప్రొటోకాల్స్ ప్రకారం రెండు దేశాలకు చెందిన స్థానిక కమాండర్లు మధ్య చర్చల అనంతరం పరిస్థితి చక్కబడింది. గతవారంలో ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. చైనా గస్తీ బృందం భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేయడంతో వారిని బలవంతంగా వెనక్కి పంపించినట్టు తెలుస్తోంది. తూర్పు లద్దాఖ్ వివాదంపై ఇరువర్గాల మధ్య మరోవిడత ఉన్నత స్థాయి మిలటరీ సమావేశాలకు ముందు ఈ సంఘటన వెలుగుచూసింది. మరో మూడు నాలుగు రోజుల్లో ఈ సమావేశం జరుగనున్నట్టు చెబుతున్నారు.


తాజాగా ఇరు దేశాల బలగాలు ముఖాముఖీ తలబడటంతో సరిహద్దుల వద్ద పెట్రోలింగ్ కార్యకలాపాలు పటిష్టం చేశారు. తాజా ఘటనపై ఒక అధికారి మాట్లాడుతూ, పరస్పర అంగీకారంతో ఇరు బలగాలు వెనక్కి మళ్లడానికి ముందు బలగాలు మధ్య తోపులాట చోటుచేసుకుందని, అయితే రక్షణ ఏర్పాట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలిపారు.

Updated Date - 2021-10-08T16:00:37+05:30 IST