టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి

ABN , First Publish Date - 2022-01-24T05:58:25+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాల ను కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎండగట్టాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 

హుజూర్‌నగర్‌ , జనవరి 23: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాల ను కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎండగట్టాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో నాయకులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బలమైన రాజ్యాంగ వ్యవస్థను తయారుచేసింది కాం గ్రెస్‌ అన్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నా ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం లో,రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. వరిసాగు వద్దని చెప్పిన సీఎం కేసీఆర్‌ రైతుసంబరాలు నిర్వహించడం సిగ్గుచేటన్నారు. రైతులకు రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రైతులు సాగుచేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయలేని కేసీఆర్‌కు సీఎంగా ఉండే హక్కు లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబపాలన సాగుతోందని, దీనికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. కష్టపడే కార్యకర్తలకు పార్టీలో సముచితస్థానం కల్పిస్తామన్నారు. డిజిటల్‌ సభ్యత్వాల నమోదులో రాష్ట్రం లో నియోజకవర్గం ప్రథమస్థానంలో ఉంటుందన్నారు. 300 సభ్యత్వాలు చేసిన కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు తన్నీరు మల్లికార్జున్‌రావు, యరగాని నాగన్న, దొంగరి వెంకటేశ్వర్లు, నిజాముద్దీన్‌, వీరారెడ్డి, అరుణ్‌కుమార్‌దేశ్‌ముఖ్‌, వెంకటేశ్వర్లు, సంపత్‌రెడ్డి, పాల్గొన్నారు.

Updated Date - 2022-01-24T05:58:25+05:30 IST