Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎల్లుండి TTD బోర్డు సమావేశం.. కీలక విషయాలపై చర్చ..!

తిరుమల : టీటీడీ నూతన ధర్మకర్తల మండలి సమావేశం ఈనెల 6వ తేదీన తిరుమల అన్నమయ్య భవనంలో జరగనున్నట్టు తెలుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే. 24 మంది సభ్యులతోపాటు ఈవో, తుడా చైర్మన్‌, ఎండోమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమిషనర్లను ఎక్స్‌అఫిషియో సభ్యులుగా ప్రకటించారు. ఈ మేరకు సభ్యులందరూ దాదాపుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈనెల 7వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనుండటంతో నిర్వహణ, ఏర్పాట్లు తదితరాలపై ముందు రోజే సభ్యులు సమావేశమై చర్చించనున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement