కళ్యాణకట్టలో ఎవరికీ కరోనా రాలేదు : టీటీడీ ఈఓ

ABN , First Publish Date - 2020-07-12T17:27:57+05:30 IST

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకన్న సన్నిధిని రోజుకు..

కళ్యాణకట్టలో ఎవరికీ కరోనా రాలేదు : టీటీడీ ఈఓ

తిరుపతి : అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన తిరుమల వెంకన్న సన్నిధిని రోజుకు సరాసరి పదివేల మంది భక్తులు దర్శించుకుంటున్నారని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఆదివారం నాడు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలపై క్లారిటీ ఇచ్చుకున్నారు. కళ్యాణకట్టలో ఇంతవరకూ ఎవరికీ కరోనా రాలేదని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పటి వరకూ 82, 520 మంది తలనీలాలు సమర్పించారన్నారు. కళ్యాణకట్టలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామని ఈవో మీడియాకు వెల్లడించారు. 


బుక్కింగ్, దర్శనం లెక్కలు ఇవీ..

జూన్ 11 నుంచి జూలై 11 వరకు ఆన్‌లైన్ టికెట్ పొంది 1,64,742 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. కరెంటు బుకింగ్ ద్వారా 85,434 మంది దర్శనం చేసుకున్నారు. నెలలో మొత్తం 2,50,176 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న వారిలో 55,669 మంది దర్శనానికి రాలేదు. 90,716 మంది కరెంటు బుకింగ్ ద్వారా టికెట్ల  తీస్కోన్నారు. 11 వేల మంది దర్శనంకు రాలేదు. వారు ఉన్న ప్రాంతంలో కరోనా ప్రభావం వల్ల 30 శాతం టికెట్ పొందినా దర్శనానికి రావటం లేదు. నెలలో 16.73 కోట్లు హుండీ ద్వారా ఆదాయం వచ్చింది. భక్తులు 100 గ్రాముల‌ బంగారు బిస్కెట్లు 20 సమర్పించారు. నెల రోజులుగా 13.36 లక్షల మంది భక్తులకు లడ్డులు అందించాము. ప్రస్తుతం టీటీడీ ఉద్యోగులు, సెక్యూరిటీ పోలీసు సిబ్బందిలో  91 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందిఈవో మీడియాకు తెలిపారు.

Updated Date - 2020-07-12T17:27:57+05:30 IST