తుంగభద్రకు తగ్గిన వరద

ABN , First Publish Date - 2021-08-04T18:10:28+05:30 IST

తుంగభద్ర జలాశయానికి ఇన్‌ప్లో పడిపోవడంతో జలాశయం అధికారు లు క్రస్ట్‌గేట్లను మూడుకు తగ్గించి 4,458 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు వదులుతున్నారు. గత నెల ఇన్‌ప్లో పెరగడంతో

తుంగభద్రకు తగ్గిన వరద

             - మూడు క్రస్ట్‌గేట్ల గుండా నదికి నీటి విడుదల


బళ్లారి(బెంగళూరు): తుంగభద్ర జలాశయానికి ఇన్‌ప్లో పడిపోవడంతో జలాశయం అధికారు లు క్రస్ట్‌గేట్లను మూడుకు తగ్గించి 4,458 క్యూసెక్కుల నీటిని మాత్రమే దిగువకు వదులుతున్నారు. గత నెల ఇన్‌ప్లో పెరగడంతో జలాశయం భద్రత దృష్ట్యా మొత్తం 33 గేట్ల గుండా లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీటిని నదికి వదిలారు. అప్పటి నుంచి క్రమేణా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద నీటి చేరిక క్రమేణా తగ్గుతూ వచ్చింది. తుంగభద్ర జలాశయం అధికారులు వరద నీటిని వృథాగా నదికి వదలకుండా జలాశయంలో స్థిరంగా నీటిని నిలువ చేస్తూ వస్తున్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 100.855 టిఎంసిలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 98.009 టిఎంసి నీరు నిలువ ఉంది. ప్రస్తుతం జలాశయం నీటి  మట్టం 1632.26 అడుగులకు చేరుకోగా, కేవలం 29,722 క్యూసెక్కులు మాత్రమే వదర నీరు వచ్చి చేరుతోంది. 


Updated Date - 2021-08-04T18:10:28+05:30 IST