Abn logo
Jun 24 2021 @ 07:19AM

టాయిలెట్ వ్యర్థాలు కలిసిన నీరు తాగి ఇద్దరు మృతి

ఐదుగురికి అస్వస్థత

మీర్జాపూర్ (ఉత్తరప్రదేశ్): టాయిలెట్ వ్యర్థాలతో కలిసిన నీరు తాగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ జిల్లాలో వెలుగుచూసింది. మీర్జాపూర్ జిల్లా దాద్రా గ్రామంలో  మరుగుదొడ్డి సమీపంలోని హ్యాండ్ పంపులోని నీటిని తాగిన ఏడుగురు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. డయేరియాతో బాధపడుతున్న వారిలో ఇద్దరు మరణించారు. 70 ఏళ్ల మహిళ, మూడేళ్ల బాలిక కలుషిత నీరు తాగి మరణించారని మీర్జాపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ పీడీ గుప్తా చెప్పారు. అధికారుల బృందం దాద్రా గ్రామాన్ని సందర్శించి మరుగుదొడ్డి నీరు కలిసి హ్యాండ్ పంపులోని నీరు కలుషితమైందని వైద్యులు చెప్పారు. కలుషితనీరు తాగి డయేరియా బారిన పడిన వారికి మందులు ఇచ్చామని వైద్యులు చెప్పారు. కలుషితనీరు చేరిన హ్యాండ్ పంపును మూసివేశారు. 

జాతీయంమరిన్ని...