‘పాక్‌ ప్రమాదం’లో ఇద్దరు మృత్యుంజయులు

ABN , First Publish Date - 2020-05-24T07:18:11+05:30 IST

పాకిస్థాన్‌లోని కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్యను 97గా పాక్‌ సైన్యం లెక్కతేల్చింది. ప్రమాద సమయంలో ఆ విమానం(పీకే 8303)లో 91 మంది ప్రయాణికులు...

‘పాక్‌ ప్రమాదం’లో ఇద్దరు మృత్యుంజయులు

కరాచీ, మే 23: పాకిస్థాన్‌లోని కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్యను 97గా పాక్‌ సైన్యం లెక్కతేల్చింది. ప్రమాద సమయంలో ఆ విమానం(పీకే 8303)లో 91 మంది ప్రయాణికులు, 8 మంది విమాన సిబ్బంది ఉండగా.. ఇద్దరు మాత్రమే మృత్యుంజయులుగా ప్రాణాలతో బయటపడ్డారు. బ్యాంక్‌ ఆఫ్‌ పంజాబ్‌ అధ్యక్షుడు జాఫర్‌ మసూద్‌, మరో ప్రయాణికుడు మహమ్మద్‌ జుబేర్‌ స్వల్ప గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 97 మంది మృతుల్లో ఇప్పటి వరకు 19 మందిని గుర్తించామని, మృతుల్లో 9 మంది చిన్నారులు ఉన్నారని పాక్‌ సైన్యం అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ బాబర్‌ ఇఫ్తెకార్‌ వెల్లడించారు.  


Updated Date - 2020-05-24T07:18:11+05:30 IST