ఉత్సాహంగా ఉగాది

ABN , First Publish Date - 2021-04-14T06:05:45+05:30 IST

ఉగాది పర్వదినాన్ని నగరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు ఆలయాల్లో స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి.

ఉత్సాహంగా ఉగాది
అవధానం చేస్తున్న ఆముదాల మురళి

గుంటూరు (సాంస్కృతికం), ఏప్రిల్‌ 13: ఉగాది పర్వదినాన్ని నగరంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు ఆలయాల్లో స్వామికి విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా బారి నుండి దేశాన్ని కాపాడాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్ధనలు చేశారు. 

- బృందావన్‌గార్డెన్స్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నాగార్జున సాంస్కృతిక కేంద్రం, ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు జరిగాయి. నోరి నారాయణమూర్తిచే పంచాంగ శ్రావణం, ఆముదాల మురళిచే అష్టావధాన కార్యక్రమాలు జరిగాయి. అష్టావధానంలో సాహితీవేత్తలు డాక్టర్‌ వి.నగరాజలక్ష్మి, డాక్టర్‌ ఇ.మాధవి, డాక్టర్‌ సూర్యదేవర రవికుమార్‌, సుఖవాసి మల్లికార్జున రాయశాస్త్రి, ప్రొఫెసర్‌ కె.సత్యనారాయణ, డాక్టర్‌ ఘంటా కిరణ్‌, ఆర్‌.గాఽంధీరాజ్‌, డాక్టర్‌ ఎం.సత్యనారాయణలు పాల్గొన్నారు. అనంతరం గాయనీ గాయకులు ఎస్‌కే రసూల్‌, ఎం.వామన కుమార్‌, ఆర్‌.గాయత్రీదేవి తమ గాత్రధారణలో పలు భక్తిగీతాలు ఆలపించారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్‌ మస్తానయ్య, సంస్థ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.సూర్యనారాయణ తదితరులు పాల్గొని కళాకారులను ఘనంగా సత్కరించారు. 

-  ఏటీ అగ్రహారం బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. తాళ్లబండి సత్యనారాయణ శర్మచే పంచాంగ శ్రవణం, పలువురు పేద మహిళలు, వృద్ధులు, వేద విద్యార్థులను నూతన వస్త్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో పి.వెంకట సత్యనారాయణ, వల్లూరి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

-  స్థానిక కొత్తపేటలోని జగన్నాథస్వామి దేవస్థానం, లాలాపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో దేవస్థాన సహాయ కమిషనర్‌, కార్యనిర్వహణాధికారి డి.శ్రీనివాసరావు, భక్తులు పాల్గొన్నారు. 

-  అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో పంచాంగ శ్రవణం, ఉగాది వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో సంగీత విద్వాంసులు వీకేడీ మల్లేశ్వరరావు, అధ్యాపకులు సుబ్బారెడ్డి, అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి, సీతారాం, లావణ్య, రాజశేఖర్‌, భాగ్యలక్ష్మీ, సుజాత, వెంకటరావు తదితరులున్నారు. 


Updated Date - 2021-04-14T06:05:45+05:30 IST