భక్తి శ్రద్ధలతో ఉగాది

ABN , First Publish Date - 2021-04-14T04:32:04+05:30 IST

ఉగాది పర్వదినాన్ని గద్వాల పట్టణ ప్రజలు మంగళవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

భక్తి శ్రద్ధలతో ఉగాది
రాజోలిలో ఎల్లమ్మ ఆలయంలో భక్తుల పూజలు

- ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలికిన ప్రజలు

- గ్రామదేవతల ఆలయాల్లో భక్తుల సందడి

- పంచాంగాన్ని చదివిన పురోహితులు

గద్వాల టౌన్‌/మల్దకల్‌/కేటీదొడ్డి/అయిజ/ రాజోలి/ ఇటిక్యాల/ధరూరు, ఏప్రిల్‌ 13 : ఉగాది పర్వదినాన్ని గద్వాల పట్టణ ప్రజలు మంగళవారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. రైతులు వేకువజామునే పొలాలకు వెళ్లి వ్యవసాయ పరికరాలకు పూజలు చేసి ఖరీఫ్‌ సా గుకు శ్రీకారం చుట్టారు. ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సభలు, సమావేశాలు, ప్రజలు గుమిగూడడంపై ఆం క్షలు ఉండడంతో ఈ ఏడాది జిల్లా కేంద్రంలో పం చాంగ శ్రవణం నిర్వహించ లేదు. పట్టణంలోని సుం కులమ్మ దేవాలయం, న్యూగంజ్‌ సమీపంలోని ఈదె మ్మ ఆలయాల్లో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి నేవైద్యాలు, కొబ్బరికాయలు సమర్పించారు. భక్తులు భౌతిక దూరం పాటించాలని ఆలయ నిర్వాహకులు ఒ త్తిడి  చేసినప్పటికీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. 

మల్దకల్‌ మండలంలో..

 మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనంలో మం గళవారం నిర్వహించిన ఉగాది పంచాం గ శ్రవణం కార్యక్రమంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. జ్యోషి రమేశాచార్యులు నూతన సం వత్సర పంచాంగాన్ని చదివి రాశి ఫలాలు, ఆదాయ వ్యయాలు, రాజపూ జ్యం, అవమానం తదితర అంశాలను వివరించారు. అంతకు ముందు మం డల కేం ద్రంలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎం పీపీ రాజారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ యాకోబ్‌, నా యకులు మధుసూదన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌ రెడ్డి, శేషంపల్లి నర్సింహులు, ప్రహ్లాదరావు, సీతారాంరెడ్డి, సత్యారెడ్డి, అజయ్‌, నర్సింహారెడ్డి, రమేశ్‌రెడ్డి, వెంకటన్న, నరేందర్‌, మధు, తిమ్మరాజు, భాస్కర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు. 

 కేటీదొడ్డి మండలంలో..

ప్లవ నామ సంవత్సరం ఉగాది వేడుకలను కేటీదొడ్డి మండల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. వెం కటాపురంలోని పాగుంట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రైతులు ఎద్దులను, వ్యవసాయ పనిముట్లను కడిగి పూజలు చేసి పొలం పనులకు శ్రీకారం చుట్టారు. 

 అయిజ మండలంలో..

  ఉగాది పర్వదినాన్ని హిందువులు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. రైతులు వేకువజామునే పంటపొలాలకు వెళ్లి కాడెద్దులతో పూజా కార్యక్రమా లు నిర్వహించి, పొలం పనులకు నాంది పలికారు. ప్లవనామ నూతన తెలుగు సం వత్సరం సందర్భంగా ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఆలయాలలో పంచాంగ శ్రవణం వినిపించారు. షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని సేవించారు. 

భీమరాయుని ఆలయంలో..

 ప్లవనామ నూతన సంవత్సరం సందర్భంగా మం గళవారం అయిజ పట్టణంలో భీమరాయుని ఆల యంలో రైతు సంఘం ఆధ్వర్యంలో  పంచాంగ శ్రవ ణం చేశారు.  ఈ ఏడాది వేయాల్సిన పంటలు, సాగుచేయాల్సిన సమయం, మంచి రోజులు, పేరు బలం గురించి  పండితులు తెలి య జేశారు. సాయంత్రం అశ్వత్త నారాయణ ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి, విష్ణుమూర్తుల ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించారు.  

 రాజోలి మండలంలో..

   ఉగాది పర్వదినం సందర్భంగా రాజోలిలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రభోత్సవాన్ని కుర్ని కుల బాంధవుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం స్వామివారికి బిందెసేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజ చేశారు.  కార్యక్రమంలో కుర్ని దైవాచార కమిటీ అధ్యక్షుడు పి. వెంకటేశ్వర్లు, సభ్యులు వంక మహేశ్‌, బీఎం రవి, శంకర్‌, కర్రె లక్ష్మన్న, రాము పాల్గొన్నారు. అలాగే ఆయా గ్రామాల్లో సుంకులమ్మ, ఎల్లమ్మ, మారెమ్మ ఆలయాల్లో అమ్మవార్లకు భక్తులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. 

 ఇటిక్యాల మండలంలో..

 ప్లవనామ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం మండలంలోని ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో గద్వాల ఎమ్మెల్యే  కృష్ణమోహన్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.  అలాగే గ్రామ దేవతల ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు చేసి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించారు. 

 ధరూరు మండలంలో..

ధరూరు మండల పరిధిలోని ర్యాలంపాడు గ్రామంలో ఉగాది పర్వదినం సందర్భంగా బీకేఎంఆర్‌  ఓపెన్‌ కబడ్డీ టోర్నీని వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, కేటీఆర్‌ యువసేన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ తిమ్మ ప్ప, చిట్టెం వెంకట్రామిరెడ్డి, నాయకులు లక్ష్మిరెడ్డి, పెద్దొ డ్డి రాముడు, నర్సింహులుగౌడు, మాణిక్యారెడ్డి, రంగారెడ్డి, రాముడు, రంగన్నగౌడు, నాగన్న పాల్గొన్నారు.

గార్లపాడులో  డోళ్ల పందెం.. 

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని  గార్లపాడు గ్రామంలో డోళ్ల పందెం పోటీలను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్‌ రంజిత్‌కుమార్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ గ్రామంలో ఇలాంటి పోటీల వల్ల సమైక్యత భావంతోపాటు గ్రామీణ కళలను ఆదరించిన వారమవుతామన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.   కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ బుచ్చిబాబు, జిల్లా కార్యదర్శి లవన్న, విష్ణు, తిమ్మప్ప, రవి, గ్రామస్థులు పాల్గొన్నారు.



Updated Date - 2021-04-14T04:32:04+05:30 IST