ఉక్రెయిన్‌లో నలుగురు రాణిపేట జిల్లా విద్యార్థులు

ABN , First Publish Date - 2022-02-27T15:54:56+05:30 IST

రష్యా దాడికి గురైన ఉక్రెయిన్‌ దేశంలో రాణిపేట జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులున్నట్లు తేలింది. రాణిపేట జిల్లా నరసింగాపురానికి చెందిన గుణశేఖరణ్‌ కుమార్తె పూజ (21), వడకాల్‌ ప్రాంతానికి చెందిన

ఉక్రెయిన్‌లో నలుగురు రాణిపేట జిల్లా విద్యార్థులు

వేలూరు(చెన్నై): రష్యా దాడికి గురైన ఉక్రెయిన్‌ దేశంలో రాణిపేట జిల్లాకు చెందిన నలుగురు విద్యార్థులున్నట్లు తేలింది. రాణిపేట జిల్లా నరసింగాపురానికి చెందిన గుణశేఖరణ్‌ కుమార్తె పూజ (21), వడకాల్‌ ప్రాంతానికి చెందిన రాజశేఖర్‌ కుమారుడు సుభాష్‌ ఎంబీబీఎస్‌ 4వ సంవత్సరం చదువుతున్నారు. వీరిద్దరూ ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయినట్లు తేలడంతో వారి తల్లిదండ్రులు శనివారం మంత్రి గాంధీని ఆశ్రయించారు. తమ పిల్లల్ని కాపాడాలంటూ ఆయన్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి గాంధీ పూజతో వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా పూజ మాట్లాడుతూ.. సుమారు 200 మంది భూగర్భంలో వున్న మెట్రోరైల్‌ మార్గంలో తలదాచుకున్నామని, కనీసం తినేందుకు కూడా ఏమీ దొరక్క అల్లాడిపోతున్నామని వాపోయింది. మంత్రి ఆమెకు ధైర్యవచనాలు పలికి, త్వరలోనే రాష్ట్రానికి పిలిపిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా వుండగా ఇదే జిల్లా వాలాజాకు చెందిన గణేష్ పెరుమాళ్‌ కుమారుడు రాజ్‌ (21), ఆర్కాడుకు చెందిన సూర్యనారాయణన్‌ కుమారుడు అశోకన్‌ (21) కూడా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. వారి తల్లిదండ్రులు రాణిపేట జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ బిడ్డల్ని కాపాడాలంటూ వినతిపత్రం అందించారు.

Updated Date - 2022-02-27T15:54:56+05:30 IST