ఓడెసాలోని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పునరుద్ధరణ!

ABN , First Publish Date - 2022-02-27T16:22:19+05:30 IST

ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌పై రష్యా పెద్ద ఎత్తున భూతల

ఓడెసాలోని ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పునరుద్ధరణ!

కీవ్ : ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌పై రష్యా పెద్ద ఎత్తున భూతల, వైమానిక దాడులు చేస్తోంది. కీవ్‌ను రష్యా సైన్యం సమీపించడాన్ని నిరోధించేందుకు ఉక్రెయిన్ సేనలు వీరోచితంగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్ ప్రభుత్వం కీవ్ నగరంలో కర్ఫ్యూ విధించింది. ప్రజలు సోమవారం వరకు తమ ఇళ్ళ నుంచి బయటకు రావొద్దని ఆదేశించింది. అయితే వేలాది మంది ఉక్రెయినియన్లు తమ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. ఉక్రెయిన్‌కు మిలిటరీ సహాయం అందజేస్తామని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ ప్రకటించాయి. 


ఉక్రెయిన్ రీజనల్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలోని పబ్లిక్ కౌన్సిల్ చీఫ్ బ్రాట్‌చుక్‌ను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఓడెసాలోని ఉక్రెయిన్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కార్యకలాపాలను పునరుద్ధరించారు. 


ఓడెసాలోని లిపెట్‌స్కే గ్రామం వద్ద ఉక్రెయిన్ మిలిటరీ యూనిట్‌పై రష్యా సేనలు ఈ నెల 24న వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 


Updated Date - 2022-02-27T16:22:19+05:30 IST