అమెరికా ఆఫర్‌ను తిరస్కరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2022-02-26T15:57:01+05:30 IST

రష్యాతో యుద్ధం నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి

అమెరికా ఆఫర్‌ను తిరస్కరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

కీవ్ : రష్యాతో యుద్ధం నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అమెరికా ఇచ్చిన ఆఫర్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ తిరస్కరించారు. యుద్ధం ఉక్రెయిన్‌లో జరుగుతోందని, తనకు ఆయుధాలు కావాలని, పలాయనం కోసం మార్గం కాదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. 


ఓ వార్తా సంస్థ శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం, ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీని కీవ్ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని అమెరికా అధికారులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై జెలెన్‌స్కీ స్పందిస్తూ, ‘‘యుద్ధం ఇక్కడ జరుగుతోంది, నాకు ఆయుధాలు కావాలి, పలాయన మార్గం కాదు’’ అని చెప్పారు. 


ఇదిలావుండగా, ఉక్రెయిన్‌పై దాడులను తక్షణమే రష్యా ఆపేయాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రతిపాదించిన తీర్మానాన్ని రష్యా వీటో చేసింది. ఇది అమెరికా, దాని మద్దతుదారులకు ముందుగానే తెలిసిన ఎదురుదెబ్బ. అయితే రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేయడానికి ఇది పనికొస్తుందని అమెరికా భావిస్తోంది. 


Updated Date - 2022-02-26T15:57:01+05:30 IST