బాబ్రీ కూల్చివేత కేసు: సీబీఐ కోర్టుకు ఉమా భారతి

ABN , First Publish Date - 2020-07-02T19:19:06+05:30 IST

1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి ఇవాళ సీబీఐ ప్రత్యేక...

బాబ్రీ కూల్చివేత కేసు: సీబీఐ కోర్టుకు ఉమా భారతి

లక్నో: 1992 బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ సీనియర్ నేత ఉమా భారతి ఇవాళ సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. ప్రాసిక్యూషన్ తరపు సాక్షులను విచారించిన మీదట సీఆర్‌పీసీ సెక్షన్ 313 కింద సీబీఐ కోర్టు ప్రస్తుతం 32 మంది నిందితుల వాంగ్మూలాలను రికార్డు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు మూడు దశాబ్దాల నాటి ఈ కేసులో ఉమా భారతి 19వ నిందితురాలిగా ఉన్నారు. మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అడ్వాణీ, బీజేపీ సీనియర్ నేత ఎంఎం జోషి, కళ్యాణ్ సింగ్ సహా మరో 13 మందిని ఇంకా విచారించాల్సి ఉంది. అయితే తాము వీడియో కాన్ఫరెన్సు ద్వారా కోర్టు ముందు హాజరవుతామంటూ వారి తరపు న్యాయవాదులు ధర్మాసనానికి నివేదించారు. 

Updated Date - 2020-07-02T19:19:06+05:30 IST