Abn logo
Oct 25 2021 @ 00:51AM

వగ్గంపల్లి హైవేపై వెలగని వీధిదీపాలు

రహదారిపై నిరుపయోగంగా ఉన్న విద్యుత్‌ దీపం

ప్రమాదాలకు  నిలయంగా  రహదారి

పామూరు, అక్టోబరు 24: నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే వగ్గంపల్లి జాతీయ రహదారి-565 కారుచీకట్లో మగ్గుతోంది. జాతీయ రహదారిపై మ ధ్యలో ఏర్పాటు చేసి డివైడర్లు లైట్లు వెలగడం లేదు. సిగ్నల్‌ లైట్లు కూడా వెలగడం లేదు. దీంతో వాహనచోదకులకు డివైడర్‌ కానరాక ప్రమాదాలబారిన పడినఘటనలు అనేకం ఉన్నాయి. రహదారి ప్రమాణాలను అధికారులు  పాటించడం లేదు. అభివృద్ది పనుల పేరుతో వగ్గంపల్లి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. అది మూన్నాళ్ళ ముచ్చటగానే వెలగకుండా ఉన్నాయి. దాంతో రాత్రి సమయాల్లో వగ్గంపల్లి జాతీయ రహదారి పూర్తిగా కారుచీకట్లు కమ్ముకున్నాయి. దాంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక పక్కనే ఉన్న డివైడర్‌ను ఢీకొన్న సంఘటనలు ఇటీవల జరిగాయి. వగ్గంపల్లి హైవే డివైడర్ల మద్య ఉన్న లైట్లు వెలగక పోవడం తమ ప్రాణాల మీదకు వస్తుందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఈ జాతీయ రహదారిపై నిత్యం అనేక వాహనాలు వెళ్తుంటాయి. డివైడర్ల మద్య లైట్లు వేశాం మాపని అయిపోయింది అంటూ హైవే సిబ్బంది నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారు. డివైడర్‌ మద్యలో నెలకొల్పబడిన లైట్లు వెలిగించే బాధ్యత హైవే యాజమాన్యం కాదని, గ్రామ పంచాయతీకి అప్పజెప్పామని హైవే సిబ్బంది అంటుండగా మాకు ఎలాంటి సంబం లేదంటూ పంచాయతీ ఽఅఽధికారులు అంటున్నారు. ఇప్పటికైనా హైవే జాతీయ రహదారి సిబ్బంది స్పందించి డివైడర్‌ మద్యన ఉన్న లైట్లు వెలిగేలా చర్యలు తీసుకుని ప్రమాదాల జరకుండా నివారణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.