కార్లు తీసుకున్నారు కంతులు మరిచారు!

ABN , First Publish Date - 2021-04-16T05:34:56+05:30 IST

గిరిజన నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం 2019లో ప్రభుత్వం ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ పథకం కింద ఇన్నోవా, బొలెరో, స్విప్టు వంటి కార్లను రుణం ద్వారా అందించింది. జిల్లాలో 15 మందికి ఈ యూనిట్లు మంజూరు చేశారు. కానీ వాహనాలు పొందిన వారు ఎవరూ ఇప్పటి వరకు వాయిదాలు(కంతులు) చెల్లించకపోవడంతో ఈ అంశాన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లింది.

కార్లు తీసుకున్నారు  కంతులు మరిచారు!

మూడేళ్లుగా పెండింగ్‌

నోటీసులకూ స్పందన కరువు

వాహనాల స్వాధీనానికి కసరత్తు


నెల్లూరు (వీఆర్సీ), ఏప్రిల్‌ 15 : గిరిజన నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం 2019లో ప్రభుత్వం ఎన్‌ఎస్‌టీఎఫ్‌డీసీ పథకం కింద ఇన్నోవా, బొలెరో, స్విప్టు వంటి కార్లను రుణం ద్వారా అందించింది. జిల్లాలో 15 మందికి ఈ యూనిట్లు మంజూరు చేశారు. లబ్ధిదారులు ఆ రుణాన్ని నెలకు రూ.15 వేలు వంతున వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. కానీ వాహనాలు పొందిన వారు ఎవరూ ఇప్పటి వరకు వాయిదాలు(కంతులు) చెల్లించకపోవడంతో ఈ అంశాన్ని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లింది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పలుమార్లు నోటీసులు జారీజేశారు. అయినా వారి నుంచి స్పందన లేకపోవడంతో ఆ 15 మంది లబ్ధిదారులకు జామీనుదారులుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సమాచారమిచ్చామని ఐటీడీఏ పీవో ఆనంద మణికుమార్‌ తెలిపారు. ఇటీవల వరుసగా ఎన్నికలు జరగడం, వాటిలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉండటంతో వాహనాల రికవరీలో జాప్యం జరిగిందని, త్వరలో వాహనాలను స్వాధీనం చేసుకోవడం గానీ రుణాలను రాబట్టడంగానీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-04-16T05:34:56+05:30 IST