Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 15 2021 @ 16:07PM

కోవిడ్ వ్యాక్సిన్ తో నపుంసకత్వం. బ్రిటన్ గాయని రచ్చ

కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా తన కజిన్ వాళ్ల ఫ్రెండ్‌కి నపుంసకత్వం వచ్చేసిందంటూ కలకలం రేపింది బ్రిటన్ గాయని నిక్కీ మినాజ్. ట్రినిడాడ్‌లోని అతనికి టీకా తీసుకున్న తరువాత వృషణాలు వాచాయంటూ వింత విషయాన్ని చెప్పిందామె. కాకపోతే, బ్రిటన్‌లో ప్రఖ్యాత ర్యాపర్ అయిన నిక్కీ మాటల్ని ఆ దేశ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. స్వయంగా చీఫ్ మెడికల్ అడ్వైజర్ క్రిస్ విట్టీ దీనిపై  స్పందించారు. ‘‘పచ్చి అబద్ధాలు’’ అంటూ కొట్టిపారేశారు. నిక్కీ మాటలు జనాల్ని భయపెట్టే విధంగా ఉన్నాయన్న ఆయన సొషల్ మీడియాలో ఇలాంటి వదంతులు వ్యాపింపజేసినందుకు ఆమె సిగ్గుపడాలని చెప్పారు. అసలే ప్రపంచం కరోనాతో అల్లాడుతోంటే వ్యాక్సిన్ల విషయంలో అపోహలు కల్పించటం, అదీ నిక్కీ మినాజ్ లాంటి మంచి ఫాలోయింగ్ ఉన్న క్రేజీ సెలబ్రిటీలు, వెనకా ముందు ఆలోచించకుండా మాట్లాడటం... నిజంగా ఆక్షేపనీయమే...         



ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement