Lakhimpur Kheri: హింసాకాండపై విచారణకు ఏకసభ్య కమిషన్‌

ABN , First Publish Date - 2021-10-07T15:56:59+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ హింసాకాండలో 8 మంది మరణించిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్...

Lakhimpur Kheri: హింసాకాండపై విచారణకు ఏకసభ్య కమిషన్‌

యూపీ గవర్నర్ ఉత్తర్వులు జారీ

లఖింపూర్ ఖేరీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ హింసాకాండలో 8 మంది మరణించిన ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ గురువారం ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ నెల 3వతేదీన లఖింపూర్ ఖేరీలో జరిగిన ఘటనలో నలుగురు రైతులు సహా 8మంది మరణించారు.రైతులను కారుతో తొక్కించి చంపిన కేసులో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రమేయం ఉండటంతో ఈ కేసుపై రాజకీయ వివాదం ఏర్పడింది.లఖింపూర్ ఖేరీ హింసాకాండ కేసును సుప్రీంకోర్టు గురువారం విచారించనుంది. 


భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ హడావుడిగా గురువారం ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేశారు.ఈ ఏకసభ్య కమిషన్ రెండు నెలల వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని గవర్నర్ ఆదేశించారు.


Updated Date - 2021-10-07T15:56:59+05:30 IST