శానిటైజర్ల తయారీకి.. 42 కంపెనీలకు యూపీ సర్కారు అనుమతి

ABN , First Publish Date - 2020-03-30T21:29:44+05:30 IST

రోజుకు 40 వేల లీటర్ల శానిటైజర్ తయారు చేసేందుకు యూపీ ప్రభుత్వం 42 కంపెనీలకు అనుమతి ఇచ్చింది.

శానిటైజర్ల తయారీకి.. 42 కంపెనీలకు యూపీ సర్కారు అనుమతి

లక్నో: రోజుకు 40 వేల లీటర్ల శానిటైజర్ తయారు చేసేందుకు యూపీ ప్రభుత్వం 42 కంపెనీలకు అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్‌పై పోరుకు శానిటైజర్ ముఖ్యమైనది కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్ నేపథ్యంలో దేశంలో శానిటైజర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో యోగి సర్కారు కంపెనీలతో ఈ మేరకు డీల్ కుదుర్చుకుంది. మొత్తం 27 డిస్టలరీలు, 15 శానిటైజర్ తయారీ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎక్సైజ్) సంజయ్ భూస్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీలు రోజుకు 40 వేల లీటర్ల శానిటైజర్లు తయారు చేస్తున్నాయి. దీనిని త్వరలోనే 60 వేల లీటర్లకు పెంచాలని యోచిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఉత్పత్తి చేసిన శానిటైజర్లను డీలర్ల ద్వారా మార్కెట్లలో అందుబాటులో ఉంచుతామన్నారు.  

Updated Date - 2020-03-30T21:29:44+05:30 IST