బ్లాక్‌లో యూరియా

ABN , First Publish Date - 2020-08-14T11:12:33+05:30 IST

జిల్లాలో పలువురు వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్లు నిఘా వర్గాలు

బ్లాక్‌లో యూరియా

యూరియా బ్లాక్‌ దందాకు తెరలేపుతున్న వ్యాపారులు

జిల్లాలో కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నాలు

ప్రైవేట్‌ దుకాణాల్లో, గోదాముల్లో భారీగా నిల్వలు

ఒక్కో యూరియా బస్తాకు అదనంగా రూ.100 నుంచి 200 వసూలు

ప్రైవేట్‌ దుకాణాల్లో కన్పించని అధికారుల తనిఖీలు

పీఏసీఎస్‌లో యూరియా స్టాక్‌ లేకపోవడమే కారణం

డిమాండ్‌కు తగ్గట్టు ప్రభుత్వం నుంచి సరఫరా కాని యూరియా

ప్రస్తుతం జిల్లాలో 300 మెట్రిక్‌ టన్నుల స్టాక్‌


కామారెడ్డి, ఆగస్టు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలువురు వ్యాపారులు యూరియా కృత్రిమ కొరత సృష్టించే ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. యూరియా బ్లాక్‌ దందాకు వ్యాపారులు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. సొసైటీలలో యూరియా నిల్వలు లేకపోవడంతో ప్రైవేట్‌ దుకాణాలు, గోదాంలలో నిల్వలు ఉన్నప్పటికీ వ్యాపా రులు పూర్తిస్థాయిలో విక్రయించడం లేదనే విమర్శలు వస్తు న్నాయి. రైతులు ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించగా ఒక్కో యూరియా బస్తాకు అదనంగా రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా జిల్లాలో యూరియా కొరత ఏర్పడుతుండటంతో రైతులు సొసైటీలు, ప్రైవేట్‌ దుకాణాల వద్ద బారులు తీరుతూ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జిల్లాలోని ప్రైవేట్‌ దుకాణాలు, గోదాంల్లో భారీగా నిల్వలు ఉన్నా అధికారులు తనిఖీలు చేయక పోవడం ఏమి టని రైతులు ప్రశ్నిస్తున్నారు.


జిల్లాలో 90వేల మెట్రిక్‌ టన్నుల ఎరువుల అవసరం

గత ఆరు సంవత్సరాల నుంచి జిల్లాలో ఎరువుల కొరత లేకుండా అధికా రులు ప్రణాళిక ప్రకారం పీఏసీ ఎస్‌లకు, ప్రైవేట్‌ వ్యాపారులకు సరఫరా చేస్తూ వస్తున్నారు. డిమాండ్‌కు తగ్గట్టుగా యూరియాతో పాటు డీఏపీ, పొటాష్‌ లాంటి ఇతర ఎరువులను సరఫరా చేస్తున్నారు. కానీ ఈ వానా కాలం సీజన్‌లో వ్యవసాయ అధికారులు జిల్లా వ్యాప్తంగా 90వేల మెట్రిక్‌ టన్నుల వరకు వివిధ ఎరువులు అవసరమని అంచనా వేశారు. వీటికి తగ్గట్టుగానే యూరియాను 45వేల మెట్రిక్‌ టన్నుల అవసరమని నిర్ణయించా రు. ఎప్పటిలాగే ఈ సీజన్‌ లోనూ ఎరువులను డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేస్తూ వస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 19వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేశారు. మొక్కజొన్న, పత్తి, సోయా, వరి పంటలు ఇతర పప్పు దినుసుల పంటలను విస్తారంగా సాగు కావడంతో యూరియా వినియో గం భారీగానే పెరిగింది.


19వేల మెట్రిక్‌ టన్నుల యూరియా సరఫరా

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు మొత్తం 19వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను వ్యవ సాయశాఖ అఽధికారులు మార్కెట్‌లోని పీఏసీఎస్‌ల కు, ప్రైవేట్‌ దుకాణాలకు సరఫరా చేశారు. ఈ ఖరీఫ్‌కు మొత్తం 46వేల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికా రులు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు 19వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇందులోం చి 53 పీఏసీఎస్‌లకు సరఫరా చేయగా మరికొంత యూరియాను ప్రైవేట్‌ దుకాణాలకు సరఫరా చేశారు. సీజన్‌ మొదటి నుంచి వర్షాలు కురవడం తో రైతులు విస్తారంగా పంటలను సాగు చేశారు. జూలై చివరి వరకు 10వేల ఎకరాలకే సాగైన వరి ఆగస్టు చివరి వరకు లక్షా ఎకరాలకు పైగా వరి సాగు అయింది. దీంతో యూరియా వినియోగం చాలానే పెరిగింది. దీంతో పాటు మొక్క జొన్న, పత్తి, సోయాలాంటి పంటల ఎదుగుదలకు అంతకుముందు నుంచే సొసైటీల నుంచి యూరి యా బస్తాలను తీసు కెళ్లి రెండు దఫాలుగా చల్లడం పూర్తయింది. దీంతో జిల్లాలోని 53 సొసైటీల్లో యూరియా సాక్ట్‌ లేకుండా పోయిందని తెలుస్తోంది.


కృత్రిమ కొరతకు వ్యాపారుల ప్రయత్నాలు

జిల్లా వ్యాప్తంగా విస్తారంగా పంటలు సాగు కావడం తో రైతుల నుంచి యూరియా డిమాండ్‌ పెరుగుతూ వస్తోంది. దీనిని అదునుగా భావిస్తున్న జిల్లాలోని పలువురు ఎరువుల దుకాణాల వ్యాపారులు యూరియా కొరత సృష్టించేందుకు తెరలేపుతున్నట్లు నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ వానాకాలం సీజన్‌కు 19వేల మెట్రిక్‌ టన్నుల యూరియాను అధికారులు సరఫరా చేశారు. ఇందులో ఎక్కువ శాతం ప్రభుత్వ పంపిణీ కేంద్రాలైన పీఏసీఎస్‌లకు సరఫరా చేయగా మిగతా సగం శాతం యూరియాను ప్రైవే ట్‌ వ్యాపారులకు అధికారులు సరఫరా చేశారు. ఇటీవల సాగు వీస్తీర్ణం పెర గడంతో రైతులు యూరియాను అధిక మొత్తంలో వినియోగిస్తున్నారు. దీనిని గమనించిన పలువురు వ్యాపారులు యూరియా కొరతను సృష్టించి పనిలో పడ్డారు. ప్రైవేట్‌ దుకాణాల్లో, గోదాంలలో భారీగా యూరియా నిల్వలు ఉన్న ప్పటికీ వాటిని బహిరంగ మార్కెట్‌లో విక్రయించకుండా బ్లాక్‌ చేస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.


తీవ్ర కొరత ఏర్పడిన తరువాత అమాంత ంగా యూరియా ధరను పెంచేసి విక్రయించేందుకు పలువురు వ్యాపారులు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. యూరియా 45 కిలోల బస్తాకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266, రావాణా, హమాలీ టాక్స్‌ కలుపుకొని రూ.270 వరకు విక్రయించాల్సి ఉంటుంది. కానీ వ్యాపారులు ప్రస్తుతం రైతు ల నుంచి యూరియా డిమాండ్‌ ఉండటం వల్ల అధిక ధరకు విక్రయిస్తున్న ట్లు సమాచారం. ఇప్పటికే గాంధారి, లింగంపేట్‌, ఎల్లారెడ్డి, నస్రుల్లాబాద్‌, బీర్కూర్‌, బాన్సువాడ, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో 45 కిలోల యూరియా బ్యాగ్‌కు అదనంగా రూ.100 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ప్రైవేట్‌ దుకాణాలు, గోదాంలపై తనిఖీలు చేస్తే భారీగా యూరియా నిల్వలు బయటపడే అవకా శాలు ఉన్నాయని రైతులతో పాటు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.


యూరియా కోసం రైతుల తిప్పలు

జిల్లాలో యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎదురవు తోంది. పీఏసీఎస్‌ల వద్ద, ప్రైవేట్‌ దుకాణాల వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరిన దృశ్యాలు కనబడుతున్నాయి. జిల్లాలో  వర్షా లు కురవడంతో విస్తారంగా సాగు పెరిగింది. ఇప్ప టికే పత్తి, మొక్కజొన్న, సోయలాంటి ఆరుతడి పంటల ఎదుగుదలకు రైతులు యూరియాను రెండు దఫాలు గా చల్లడంతో పాటు మరింత డోస్‌ కోసం యూరియాను ఆ పంటలకు ఉపయోగిస్తున్నారు. ఇదే సమయంలో వరి సాగు సైతం లక్ష ఎకరాలు దాటడం తో ఈ పంటకు యూరియా మరింత అవసరం కావస్తుండటంతో రైతుల నుంచి మరింత డిమాండ్‌ పెరిగింది. ఇదే క్రమంలో గత వారం రోజులుగా జిల్లా లోని సొసైటీల్లో యూరియా నో స్టాక్‌ ఏర్పడు తోంది.

Updated Date - 2020-08-14T11:12:33+05:30 IST