Abn logo
Apr 19 2021 @ 08:07AM

వెడ్డింగ్ గౌనులో వ్యాక్సిన్... వధువు ఫొటో వైరల్!

వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. లక్షలాదిమందిని పొట్టనపెట్టుకుంటోంది. ఈ నేపధ్యంలో కరోనా నుంచి ప్రజలను రక్షించేందుకు దేశాలన్నీ కరోనా వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశాయి. ఇటువంటి సమయంలో అమెరికాలోని బాల్టీమోర్ ప్రాంతానికి చెందిన ఒక యువతి వినూత్న రీతిలో టీకా వేయించుకుంది. ఇప్పుడు ఈ ఫొటో వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లో పెళ్లి చోసుకోబోతున్న వధువు సారా వెడ్డింగ్ గౌనులో వ్యాక్సినేషన్ సెంటర్‌కు వచ్చి కరోనా టీకా వేయించుకుంది. అనంతరం నేరుగా వివాహ వేదిక వద్దకు చేరుకుంది. కొద్దిమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో సారా వివాహం జరిగింది. టీకా వేయించుకున్న సారా దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు సారాను మెచ్చుకుంటున్నారు. ఇది పలువురికి స్ఫూర్తినిస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement