బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-10-15T05:54:31+05:30 IST

బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను రద్దు చేయాలని కోరుతూ యుటీఎఫ్‌ నేతలు గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవోకు వినతి పత్రం అందజేశారు.

బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను రద్దు చేయాలి
డీఈవోకు వినతిపత్రం అందజేస్తున్న యుటీఎఫ్‌ నేతలు

19న డీఈవో కార్యాలయం ముట్టడి

డీఈవోకు యూటీఎఫ్‌ నేతల వినతి

నెల్లూరు (విద్య) అక్టోబరు 14 : బోధనకు ఆటంకంగా ఉన్న యాప్‌లను రద్దు చేయాలని కోరుతూ యుటీఎఫ్‌ నేతలు గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ మాట్లాడుతూ ఏడాదిగా నెట్‌వర్క్‌ సరిగాలేక, సర్వర్లు పనిచేయక పలు యాప్‌లలో సమాచారం అప్‌లోడ్‌ చేయడంలో ఉపాధ్యాయులు సమస్యలు ఎదుర్కొంటు న్నారన్నారు.  విద్యాశాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు కూడా తెలిపామని తెలి పారు. పాఠశాలలు పునః ప్రారంభమైన అనంతరం యాప్‌ల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన మంత్రి నేటి వరకు పట్టించుకోలేదన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు అప్‌లోడ్‌లు చేయడంలేదన్న కారణంతో మెమోలు జారీచేయడం విచారక రమన్నారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈనెల 19న డీఈవో కార్యాలయాన్ని ముట్టడినిస్తామని  తెలిపారు. కార్యక్రమంలో యుటీఎఫ్‌ ఉపాధ్యక్షుడు ఎంసీ. అచ్చయ్య, కార్యదర్శి ఎన్‌.మధుసూదనరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-15T05:54:31+05:30 IST