అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2020-10-22T05:52:13+05:30 IST

అత్యవసర సమయాలలో అంబులెన్స్‌ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు.

అంబులెన్స్‌ సేవలు వినియోగించుకోవాలి

కలెక్టర్‌ భారతి హోళికేరి 


మంచిర్యాల, అక్టోబరు 21: అత్యవసర సమయాలలో అంబులెన్స్‌ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్‌ భారతి హోళికేరి అన్నారు. బుధవారం మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుతో కలిసి కలెక్టరేట్‌ కార్యాలయ ప్రాంగణంలో కలెక్టర్‌ అంబులెన్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన గిఫ్ట్‌ స్ల్మైల్‌ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల శాసనసభ్యులు అత్యాధునిక సదుపాయాలు కలిగిన 20 లక్షల 50 వేల రూపాయల విలువ గల అంబులెన్స్‌ను అందించినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అత్యవసర సమయాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు గర్భిణులకు ఆపద సమయంలో ఈ వాహనం దోపడపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెంట రాజయ్య, మాజీ ఎమ్మల్యే గడ్డం అరవిందరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గాజుల ముఖేష్‌గౌడ్‌, నడిపెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ నడిపెల్లి విజిత్‌రావు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 


చెన్నూరు: గిఫ్ట్‌ఏస్మైల్‌ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం విప్‌ బా ల్క సుమన్‌ అందించిన అంబులెన్స్‌ను బుధవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అర్చనగిల్డా ప్రారంభించారు.  ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో తొలి విడతలో భాగంగా అత్యాధునిక సదుపాయాలతో కూడిన అంబులెన్స్‌ను చెన్నూరు కేటాయించగా దానిని ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నవాజుద్దీన్‌, జడ్పీటీసీ తిరుపతి, ఎంపీపీ మంత్రి బాపు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు దామోదర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-22T05:52:13+05:30 IST