Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి

మదనపల్లె రూరల్‌, డిసెంబరు 3: ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్‌ నారాయణరెడ్డి చెప్పారు. శుక్రవారం మదనపల్లె మండలంలోని వేంపల్లె, మాలేపాడు పంచాయతీల్లో జరిగిన ఉపాఽధి పనులను ఆయనతో పాటు రాష్ట్ర కోఆర్డినేటర్‌ సుధీర్‌, అంబుడ్స్‌పర్సన్‌ పద్మజ, ఏపీడీ చందన తదితరులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వేంపల్లె పంచాయతీ కొండమీద తాండాలో రైతు బుజ్జమ్మ సాగుచేసిన రోజా తోటను పరిశీలించారు. నెలకు ఖర్చులు పోను రూ.30వేలకు పైగా ఆదాయం వస్తుందని  రైతు తెలిపారు. అనంతరం జంగాలపల్లె రోడ్డులో  ఫారంపాండ్‌ను పరిశీలించారు. అదేవిధంగా గ్రామాలకు ఉపయోగపడే పనులు చేసుకుని అభివృద్ధి చేసుకోవాలని ఆయన రైతులకు సూచించారు.  ఎంపీడీవో లీలామాధవి, ఏపీవో సుబ్రమణ్యం, టీసీలు పవన్‌, సుప్రజ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement