కరోనా పరీక్షలపై యూపీ సర్కారు కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2021-02-27T12:52:58+05:30 IST

కరోనా పరీక్షల విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

కరోనా పరీక్షలపై యూపీ సర్కారు కీలక నిర్ణయం

మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి

లక్నో (ఉత్తరప్రదేశ్): కరోనా పరీక్షల విషయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేస్తూ యూపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులకు యాంటీజెన్ కొవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. యాంటీజెన్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, అలాంటి వారిని హోం ఐసోలేషన్ కు తరలించాలని యూపీ అదనపు చీఫ్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షల్లో నెగిటివ్ అని తేలితే వారిని వారం రోజుల పాటు హోం క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయించారు. రైలు, బస్సు మార్గాల్లో వచ్చే ప్రయాణికులు కూడా కొవిడ్ పరీక్షలు తప్పనిసరి అని యూపీ సర్కారు పేర్కొంది. కరోనా వైరస్ గొలుసును విచ్ఛిన్నం చేసేందుకు కరోనా పరీక్షలు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.యూపీలో రోజుకు 1.25 లక్షల మందికి కరోనా పరీక్షలు చేయాలని సీఎం ఆదేశించారు.

Updated Date - 2021-02-27T12:52:58+05:30 IST