మే, జూన్‌లతో పోలిస్తే జూలైలో పెరిగిన కరోనా వ్యాక్సినేషన్!

ABN , First Publish Date - 2021-08-01T17:45:03+05:30 IST

దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు...

మే, జూన్‌లతో పోలిస్తే జూలైలో పెరిగిన కరోనా వ్యాక్సినేషన్!

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఇప్పటివరకూ 46.72 కోట్లమందికి టీకాలు వేశారు. గడచిన 24 గంటల్లో మొత్తం 53 లక్షల 72 వేల 302 మందికి టీకాలు వేశారు. 


వీరిలో 38 లక్షల 22 వేల 241 మందికి టీకా తొలి డోసు వేశారు. అలాగే 15 లక్షల 50 వేల 61 మందికి రోండో డోసు టీకా వేశారు. మే, జూన్‌లతో పోలిస్తే జూలైలో వ్యాక్సినేషన్‌లో  వేగవంతం కనిపించింది. దేశంలో మే 31 నాటికి 21 కోట్ల, 31 లక్షల, 54 వేల 129 డోసులు టీకాలు వేశారు. జూన్ చివరినాటికి 33 కోట్ల 54 లక్షల, 69 వేల 340 మందికి టీకాలు వేశారు. ఇక జూలై విషయానికి వస్తే 31 నాటికి 46 కోట్ల 72 లక్షల, 59 వేల 775 డోసుల టీకా వేశారు. ఒక్క జూలై నెలలో 13 కోట్ల 17 లక్షల 90 వేల 435 డోసుల టీకా వేశారు.


Updated Date - 2021-08-01T17:45:03+05:30 IST