నేడు కోవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీ

ABN , First Publish Date - 2021-05-15T06:31:45+05:30 IST

కోవాగ్జిన్‌ 32 వేల డోసులు, కోవిషీల్డ్‌ 20 వేల డోసుల వ్యాక్సిన్‌ నిల్వలు జిల్లాకు శుక్రవారం దిగుమతయ్యాయి.

నేడు కోవాగ్జిన్‌ రెండో డోసు పంపిణీ

కోవాగ్జిన్‌ 32 వేల డోసులు, కోవిషీల్డ్‌ 20 వేల డోసుల వ్యాక్సిన్‌ నిల్వలు జిల్లాకు శుక్రవారం దిగుమతయ్యాయి. తొలి డోసు తీసుకుని కోవా గ్జిన్‌ 28 రోజులు, కోవిషీల్డ్‌ 42 రోజుల వ్యవధి పూర్తయిన వారికి వీటిని రెండో డోసుగా వేస్తారు. 163 పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, ప్రభుత్వా సుపత్రుల్లో శని, ఆదివారాల్లో ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కోవాగ్జిన్‌ మందును సరఫరా చేస్తారు. సోమవారం నుంచి కోవిషీల్డ్‌ టీకా వేసే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌ పంపిణీపై తుది నిర్ణయాన్ని జేసీ (అభివృద్ధి) హిమాన్షు శుక్లా తీసుకోవాల్సి ఉంది. 


Updated Date - 2021-05-15T06:31:45+05:30 IST