నేటి నుంచి హై ఎక్స్‌పోజర్‌ గ్రూప్‌ వారికి వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-06-14T05:43:42+05:30 IST

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 14 నుంచి 17 వరకు నాలుగురోజులపాటు హై ఎక్స్‌పోజర్‌ గ్రూప్‌కు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జువేరియా ఒక ప్రకటనలో తెలిపారు.

నేటి నుంచి హై ఎక్స్‌పోజర్‌ గ్రూప్‌ వారికి వ్యాక్సిన్‌

సుభాష్‌నగర్‌, జూన్‌ 13: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 14 నుంచి 17 వరకు నాలుగురోజులపాటు హై ఎక్స్‌పోజర్‌ గ్రూప్‌కు కొవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ జువేరియా ఒక ప్రకటనలో తెలిపారు. వీరితోపాటు పూజారులు, ఇమామ్‌లు, పాస్టర్లకు వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

- హై ఎక్స్‌పోజర్స్‌ వివరాలు..

ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ 2644, బేవరేజెస్‌ కంపెనీ లిమిటెడ్‌ ఉద్యోగులు 1821, పీఆర్‌ఐ రిప్రజెంటిటివ్స్‌ 1,18,153, విద్యుత్‌శాఖ 41,131, స్టాంపులు, రిజిస్ర్టేషన్ల శాఖ 1,076, బ్యాంకు ఉద్యోగులు 23,359, ఆర్‌ఎంపీలు 35,000, ఇంజనీరింగ్‌ ఉద్యోగులు 25,000, ఐకేపీ సిబ్బంది ఆరు వేలు, పోస్టల్‌శాఖ ఉద్యోగులు 13 వేలు, వ్యవసాయశాఖ ఉద్యోగులు ఐదు వేలు, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌ కమిటీ సిబ్బంది వెయ్యి మంది, డయాలసిస్‌, తలసేమియా బాధితులకు 20 మందిి నాలుగురోజులపాటు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. సోమవారం టీఎన్జీవో భవన్‌లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు డీఎంహెచ్‌వో పేర్కొన్నారు. 

 విద్యుత్‌ ఉద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

గణేశ్‌నగర్‌: టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌ 16 సర్కిళ్ల పరిధిలోని విద్యుత్‌ ఉద్యోగులకు సోమవారం నుంచి టీకాలు ఇవ్వనున్నట్లు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అన్నమనేని గోపాల్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి విద్యుత్‌ ఉద్యోగి ఈ అవకాశాన్ని వినియోగించుకొని టీకాలు వేయించుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అన్నివిధాలుగా చర్యలు తీసుకుంటున్నదని, ఇందులో భాగంగా నిరంతరం శ్రమిస్తున్న విద్యుత్‌ ఉద్యోగులకు టీకాలు ఇవ్వడానికి అంగీకరించి ఆదేశాలు జారీ చేయడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎం డి ప్రభాకర్‌రావుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించా లని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్స్‌ వాడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, కరోనా బారినుండి రక్షించుకోవాలని కోరారు. 


Updated Date - 2021-06-14T05:43:42+05:30 IST