అర్హులందరికీ సత్వరమే వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2021-12-08T05:50:03+05:30 IST

పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులూ తీసుకునేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా క్షయ నివారణ అధికారి (డీటీసీవో) డాక్టర్‌ వసుంధర అన్నారు.

అర్హులందరికీ సత్వరమే వ్యాక్సిన్‌
లంబసింగి పీహెచ్‌సీలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఆన్‌లైన్‌ డేటాను పరిశీలిస్తున్న డీటీసీవో వసుంధర


వైద్య సిబ్బందికి డీటీసీవో డాక్టర్‌ వసుంధర ఆదేశం


చింతపల్లి, డిసెంబరు 7: పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులూ తీసుకునేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా క్షయ నివారణ అధికారి (డీటీసీవో) డాక్టర్‌ వసుంధర అన్నారు. మంగళవారం స్థానిక సీహెచ్‌సీని, లంబసింగి పీహెచ్‌సీని సందర్శించారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌, గర్భిణులకు తనిఖీలు, క్షయ నిర్ధారణ, చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఒక డోసు కూడా కొవిడ్‌ టీకా వేయించుకోని వారిని వెంటనే గుర్తించి ఈ నెల 15తేదీలోగా మొదటి డోసు వేయాలని ఆదేశించారు. మాతాశిశు మరణాలను నివారించడానికి గర్భిణులను ప్రసవ సమయానికి ఐదు రోజుల ముందే సమీపంలోని ఆస్పత్రికి తరలించాలని ఆమె చెప్పారు. క్షయ నిర్ధారణ పరీక్షలు పెంచాలని, క్షయ బారినపడిన వ్యక్తులు క్రమంతప్పకుండా మందులు వేసుకునేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆమె వెంట సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహేశ్వరరావు, లంబసింగి వైద్యాధికారి నీరజ వున్నారు.


Updated Date - 2021-12-08T05:50:03+05:30 IST