Abn logo
Nov 23 2020 @ 01:13AM

వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

అంతర్వేది, నవంబరు 22: స్వయం ఉపాఽధి పథకం ద్వారా   ఎస్సీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ యువత ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చని ఎంపీడీవో వరప్రసాద్‌బాబు అన్నారు. స్వయం ఉపాఽధి పథకం ద్వారా యువతకు నాలుగు చక్రాల మినీట్రక్‌ వాహనాలు అందిస్తున్నామని అన్నారు. ఏడో తరగతి ఉత్తీర్ణులై, 21 నుంచి 45ఏళ్లలోపు వారు నెలకు రూ.10వేలు ఆదాయం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.  లబ్ధిదారుని వాటా 10శాతం, బ్యాంకు రుణం 30శాతం, రాయితీ 60శాతం, మొత్తం యూనిట్‌ విలువ రూ.5,81,190 ఉంటుందని ఆయన తెలిపారు. 

Advertisement
Advertisement