టీకా కోసం ఎదురుచూపులు

ABN , First Publish Date - 2021-05-06T06:15:51+05:30 IST

జిల్లాలో వ్యాక్సిన్‌(టీకా) కోసం ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నామమాత్రంగానే సాగుతోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 4.70లక్షల మందికి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాను వేశారు. అయితే అందులో ప్రారంభంలో ఎక్కువమంది కొవాగ్జిన్‌ వేయించుకున్నారు. ప్రస్తుతం కొవాగ్జిన్‌ అందుబాటులో లేకపోవడంతో సెకండ్‌ డోసు వేయించుకునేందుకు ప్రజానీకం ఎదురుచూస్తున్నారు.

టీకా కోసం ఎదురుచూపులు
ఒంగోలు రిమ్స్‌లో వ్యాక్సిన్‌ కోసం క్యూలో ఉన్న ప్రజలు

కేంద్రాల చుట్టూ తిరుగుతున్న ప్రజానీకం

ఏ టీకా ఎప్పుడు వస్తోందో తెలియని పరిస్థితి

ఒంగోలు(కలెక్టరేట్‌), మే 5 : జిల్లాలో వ్యాక్సిన్‌(టీకా) కోసం ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి జిల్లాలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నామమాత్రంగానే సాగుతోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 4.70లక్షల మందికి కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాను వేశారు. అయితే అందులో ప్రారంభంలో ఎక్కువమంది కొవాగ్జిన్‌ వేయించుకున్నారు. ప్రస్తుతం కొవాగ్జిన్‌ అందుబాటులో లేకపోవడంతో సెకండ్‌ డోసు వేయించుకునేందుకు ప్రజానీకం ఎదురుచూస్తున్నారు. ఆయా కేంద్రాలతో పాటు అర్బన్‌ హెల్త్‌ కేంద్రాల వద్దకు కూడా భారీగా వస్తున్నారు. అయితే అక్కడ టీకా అందుబాటులో లేకపోవడంతో తిరిగి వెనక్కు వెళ్తున్నారు. ఇప్పటికే మొదటి డోసు కొవాగ్జిన్‌ వేయించుకున్న వారు 50రోజులు గడుస్తున్నా రెండో డోసు లేక ఆందోళన చెందుతున్నారు.


నేడు,రేపు అంటూ కాలయాపన

కాగా కొవాగ్జిన్‌ టీకా నేడు, రేపు అంటూ వైద్యారోగ్యశాఖ అధికారులు కాలయాపన చేస్తున్నారు. గత నాలుగురోజుల నుంచి ఏ రోజుకారోజు కొవాగ్జిన్‌ వస్తుందని ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు జిల్లాకు చేరలేదు. దానిపై అధికారులకు స్పష్టత లేని పరిస్థితి. రాష్ట్రస్థాయిలో ఏరోజుకారోజు జిల్లాలకు వ్యాక్సిన్‌ డోసుల కేటాయింపులు చేస్తున్నట్లు చెబుతున్నా వాస్తవంగా జిల్లాకు కొవ్యాగ్జిన్‌ వస్తున్న పరిస్థితి లేకుండాపోయింది. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ మాత్రం బుధవారం 35 వేల డోసులు వచ్చాయి. వీటిని సెకండ్‌ డోస్‌ వేసేవారికే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిసింది. 


జిల్లాలో 13,365మందికి టీకాలు

జిల్లాలో బుధవారం 13,365 మందికి వ్యాక్సిన్‌ (టీకాలు) వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్‌చార్జీ అధికారి డాక్టర్‌ సురే్‌షకుమార్‌ తెలిపారు. 126 టీకా కేంద్రాల్లో ఈ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 4,74,450 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు.

Updated Date - 2021-05-06T06:15:51+05:30 IST