కరోనా కట్టడికి కొవిడ్‌ టీకా తప్పనిసరి

ABN , First Publish Date - 2021-06-07T06:05:04+05:30 IST

కరోనా కట్టడికి కొవిడ్‌ టీకా తప్పనిసరి

కరోనా కట్టడికి కొవిడ్‌ టీకా తప్పనిసరి
తేలప్రోలు జడ్పీ హైస్కూల్‌లో వ్యాక్సినేషన్‌

ఉంగుటూరు, జూన్‌ 6 : కరోనాని కట్టడి చేయాలంటే కొవిడ్‌ టీకా తప్పనిసరని నలభైఐదేళ్లు పైబడ్డ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా  టీకా వేయించుకోవాలని సర్పంచ్‌ లాం దిబోర అన్నారు.  తేలప్రోలు జడ్పీహైస్కూల్‌లో ఉంగుటూరు పీహెచ్‌సీ వైద్యాధికారిణి కాట్రగడ్డ వాణి ఆధ్వర్యంలో  నిర్వహించిన కొవిడ్‌ టీకా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.   సచివాలయ ఇన్‌చార్జి సెక్రటరీ, ఈవోపీఆర్డీ మాట్లాడుతూ గ్రామంలో కరోనా కేసులు తీవ్రమౌతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణ పాటించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైద్యబృందం సుమారు 240మందికి కోవీషీల్డ్‌ మొదటిడోసు వ్యాక్సిన్‌ వేశారు. ఉపసర్పంచ్‌ వింత ఆదినారాయణరెడ్డి, ఏఎన్‌ఎంలు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

  బాపులపాడు మండలంలో..

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌  : బాపులపాడు మండలంలో కరోనా వ్యాక్సినేషన్‌ పంపిణీ ఆదివారం కొనసాగింది. వ్యాక్సిన్‌ పంపిణీ మొదలు పెట్టిన సమయంలో ప్రజలు త్వరపడటంతో కొంత గందరగోళం నెలకొంది. ఎస్సై గౌతమ్‌కుమార్‌ తన సిబ్బందితో గుంపులుగా ఉన్న ప్రజలను క్యూలైన్లలో నిలబెట్టడంతో వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ కార్యక్రమం కొనసాగించారు.  బాపులపాడు వైద్యాధికారి డాక్టర్‌ మంజూష, వీరవల్లి వైద్యాధికారి డాక్టర్‌ శిరీషల పర్యవేక్షణలో రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి   వ్యాక్సిన్‌ పంపిణీ చేశారు. సోమవారం వ్యాక్సిన్‌ పంపిణీ జరుగుతుందని తెలిపారు.

Updated Date - 2021-06-07T06:05:04+05:30 IST