వడ్డె ఓబన్న సేవలు చిరస్మరణీయం

ABN , First Publish Date - 2021-01-21T07:04:23+05:30 IST

ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సంస్థానంలో సర్వసైన్యాధ్యక్షుడు, స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత వడ్డె ఓబన్న సేవలు చిరస్మరణీ

వడ్డె ఓబన్న సేవలు చిరస్మరణీయం

రాంనగర్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి సంస్థానంలో సర్వసైన్యాధ్యక్షుడు, స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత వడ్డె ఓబన్న సేవలు చిరస్మరణీయమని ఎంబీసీ డీఎన్‌టీ జాతీయ ఉపాధ్యక్షుడు దండి వెంకట్‌ అన్నారు. బుధవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్యవిజ్ఞాన కేంద్రంలో తెలంగాణ వడ్డెర జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వడ్డె ఓబన్న 214వ జయంతి సందర్భంగా సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయలసీమలో వడ్డె ఓబన్న, తెలంగాణలో సర్దార్‌ సర్వాయి పాపన్న, కొమురంభీం, భాగ్యరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక భూమికను పోషించారని గుర్తు చేశారు. వడ్డెర జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ వడ్డె ఓబన్న చరిత్రను పాలక ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. వడ్డెరుల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు లింగమయ్య, రంగయ్య, రమేష్‌, ఇంద్రసేన, రవి, నవీన్‌, సోమరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T07:04:23+05:30 IST