పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి : బీజేపీ

ABN , First Publish Date - 2021-12-02T07:03:24+05:30 IST

రాష్ట్ర ప్రభు త్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించి ధరలను నియంత్రించాలని బీ జేపీ నాయకులు డిమాండ్‌ చేశారు.

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి : బీజేపీ
యాదగిరిగుట్టలో ఎడ్లబండితో నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులు

యాదాద్రిటౌన, భూదానపోచంపల్లి, డిసెంబరు 1: రాష్ట్ర ప్రభు త్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను తగ్గించి ధరలను నియంత్రించాలని బీ జేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం పట్టణంలో వినూత్న రీ తిలో ఎడ్లబండితో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకు డు రచ్చ శ్రీనివాస్‌ మాట్లాడుతూ బీజేపీ పాలిత రాషా్ట్రల్లో పెట్రోల్‌, డీజిల్‌ పై వ్యాట్‌ను తగ్గించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌  ఎందుకు తగ్గించడంలేదని ప్రశ్నించారు. ప్రజలను, రైతులను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని,  రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమం లో పార్టీ జిల్లా కోశాధికారి కాదూరి అచ్చయ్య, మండల, పట్టణ అధ్యక్షు లు కళ్లెం శ్రీనివాస్‌, భువనగిరి శ్యామ్‌, నాయకులు భాస్కర్‌రెడ్డి, శ్రీనివాస్‌, సత్యం, వెంకటరత్నం, భాను, రాజశేఖర్‌రెడ్డి, గణేష్‌ పాల్గొన్నారు. 

భూదానపోచంపల్లి: భూదానపోచంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ట్రా క్టర్‌కు తాడులు కట్టి లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు మేకల చొక్కారెడ్డి మాట్లాడుతూ వెం టనే వ్యాట్‌ తగ్గించి సామాన్యులపై భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు  కార్యక్రమంలో పార్టీ ప్రధానకార్యదర్శి పల్లె కాడి బసవయ్య, నాయకులు తండా రమేష్‌, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కండరాల సుశీల, పట్టణ కార్యదర్శి లింగస్వామి, కోశాధికారి నరసింహారావు, అంజయ్య, బసవయ్య తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-12-02T07:03:24+05:30 IST