ముగిసిన వీరారాధన ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-12-08T05:27:02+05:30 IST

పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం కల్లిపాడు కార్యక్రమం కన్నుల విందుగా చేశారు. వేకువజామునే వీరాచారవంతులు లంకన్న ఒరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముగిసిన వీరారాధన ఉత్సవాలు
పీఠాధిపతిని ఊరేగింపుగా తీసుకొస్తున్న వీరాచారవంతులు

కారంపూడి, డిసెంబరు7: పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం కల్లిపాడు కార్యక్రమం కన్నుల విందుగా చేశారు. వేకువజామునే వీరాచారవంతులు లంకన్న ఒరుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్రహ్మనాయుడు వేషధారణలో పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవను వీరాచారవంతులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం  గంగధార మడుగులో స్నానమాచరించారు. కొణతాలకు గ్రామోత్సవం జరిపారు. వీరవిద్యావంతులు కల్లిపాడు కథను గానం చేశారు.  దీంతో వీరారాధన ఉత్సవాలు ముగిశాయి.  

 

Updated Date - 2021-12-08T05:27:02+05:30 IST