కొనలేం... తినలేం..

ABN , First Publish Date - 2021-10-24T04:54:12+05:30 IST

సాధారణంగా కార్తీక మాసంలో పెరిగే కూర గాయల ధరలు ఈ ఏడాది కాస్త ముందుగానే చుక్కలు చూపిస్తున్నాయి.

కొనలేం... తినలేం..

 కొండెక్కిన కూరగాయల ధరలు  

 వర్షాలతో తగ్గిన దిగుబడి  

గణపవరం, అక్టోబరు 23: సాధారణంగా కార్తీక మాసంలో పెరిగే కూర గాయల ధరలు ఈ ఏడాది కాస్త ముందుగానే చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాలతో కూరగాయల పంటలకు  నష్టం వాటిల్లడమే ఇందుకు కారణం అంటున్నారు. మహారాష్ట్ర, కర్నూలులో ఉల్లిపంటలు దెబ్బతినడంతో కిలో ఉల్లి ధర రూ. 45–50 పలుకుతోంది. వంకాయలు కిలో రూ.60, చిక్కుడు రూ.80, బీర, దొండ, బెండ రూ.60, బీట్‌రూట్‌, క్యారెట్‌ రూ. 60 ఇలా ఏ కూరగాయలైనా కిలో రూ. 50 పైమాటే. ఆకు కూరల  ధరలు కూడా ఆకాశాన్నంటాయి. బంగాళదుంప, అల్లం, క్యాబేజీ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకోవడంతో వాటి ధరలు కూడా అందుబాటులో లేవు.  ఇక నిత్యావసర వస్తువుల ధరలు చెప్పనక్కర లేదు.  ప్రభుత్వం స్పందించి ధర లను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. 


Updated Date - 2021-10-24T04:54:12+05:30 IST