వెంకటాపూర్‌ (పీటీ) హన్‌మాన్‌ ఆలయంలో చోరీ

ABN , First Publish Date - 2021-01-16T05:58:47+05:30 IST

తూప్రాన్‌ పట్టణ పరిధిలోని వెంకటాపూర్‌(పీటీ) ఆంజనేయస్వామి ఆలయంలో సంక్రాంతి పండుగ రోజు (గురువారం రాత్రి) చోరీ జరిగింది.

వెంకటాపూర్‌ (పీటీ) హన్‌మాన్‌ ఆలయంలో చోరీ
ఆలయ గేట్‌ తాళాలు పగలగొట్టిన దృశ్యం

తూప్రాన్‌, జనవరి 15: తూప్రాన్‌ పట్టణ పరిధిలోని వెంకటాపూర్‌(పీటీ) ఆంజనేయస్వామి ఆలయంలో సంక్రాంతి పండుగ రోజు (గురువారం రాత్రి) చోరీ జరిగింది. ఆలయ చెనెల్‌గేట్‌ తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. గర్భగుడిలో పూజా సామగ్రిని చిందరవందర చేశారు. హుండీలోని నగదు, ఇత్తడి, రాగి ఇతర పూజా సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఆలయంలో తరుచూ చోరీ జరుగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గతంలోనూ విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారని పూజారి వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీసులు అక్కడకు చేరుకుని ఆధారాలను సేకరించారు.


Updated Date - 2021-01-16T05:58:47+05:30 IST