ఫిబ్రవరి 12 నుంచి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-27T05:17:02+05:30 IST

స్థానిక నగరంలోని సంకల్‌భాగ్‌లో వెలసిన శ్రీదేవి భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కళ్లె చంద్రశేఖర శర్మ, కార్యదర్శి హెచ్‌కే రాజశేఖర్‌రావు, కార్యవర్య సభ్యులు రామమనోహర్‌, సోమనాథ్‌, ఆలయ మేనేజర్‌ రాఘవేంద్ర పేర్కొన్నారు.

ఫిబ్రవరి 12 నుంచి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఆహ్వాన పత్రికను ఆవిష్కరిస్తున్న రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌


కర్నూలు(ఎడ్యుకేషన్‌), డిసెంబరు 26:  స్థానిక నగరంలోని సంకల్‌భాగ్‌లో వెలసిన శ్రీదేవి భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కర్నూలు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కళ్లె చంద్రశేఖర శర్మ, కార్యదర్శి హెచ్‌కే రాజశేఖర్‌రావు, కార్యవర్య సభ్యులు రామమనోహర్‌, సోమనాథ్‌, ఆలయ మేనేజర్‌ రాఘవేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్బంగా వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను శనివారం రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్‌  ఆవిష్కరించారు. అంతకుముందు ఆలయంలో ఆయన స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్‌ మాట్లాడుతూ వచ్చే ఏడాది ఫిబ్రవరి 12 నుంచి 23వ తేదీ వరకు జరిగే స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో ప్రజలు అధిక  సంఖ్యలో పాల్గొని  విజయవంతం చేయాలని కోరారు. ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ పిబ్రవరి 12వ తేదీ ధ్వజారోహణంతో ప్రారంభమయ్యే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగుస్తాయని చెప్పారు. కార్యక్రమంలో వాయుసేన సేవాదళ్‌ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-27T05:17:02+05:30 IST