ఉద్యోగులను వంచిస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-02-28T11:12:50+05:30 IST

తెలంగాణ ఉద్య మంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఉద్యోగులను ఇప్పటి ప్ర భుత్వం వంచిస్తోందని ఉద్యోగుల ఐక్య కార్యా చరణ నాయకులు విమర్శించారు.

ఉద్యోగులను వంచిస్తున్న ప్రభుత్వం

3 నెలల్లో ఇవ్వాల్సిన పీఆర్‌సీ నివేదికను 30 నెలలకు సాగదీత

ఉద్యోగ జేఏసీ నాయకులు


వనపర్తి, ఫిబ్రవరి 27 : తెలంగాణ ఉద్య మంలో కీలక పాత్ర పోషించి, రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ఉద్యోగులను ఇప్పటి ప్ర భుత్వం వంచిస్తోందని ఉద్యోగుల ఐక్య కార్యా చరణ నాయకులు విమర్శించారు. పట్టణంలోని టీఎన్‌జీవో భవనంలో జేఏసీ కన్వీనర్‌ వేణుగో పాల్‌తో పాటు పలుసంఘాల నాయకులు, కో కన్వీనర్లు విలేకర్లతో మాట్లాడారు.  రాష్ట్రాన్ని సా ఽధించుకున్నాక, ఇది మన ప్రభుత్వం, ప్రెండ్లీ గ వర్నమెంట్‌ అని ఉద్యోగులు భావించామని, అ యితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల పట్ల వివక్ష చూపుతోందని వారు ఆరోపించారు. జూలై 2018 నుంచి పీఆర్సీ ఇవ్వాల్సి ఉండగా నేటికీ అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. మూడు నె లల్లో పీఆర్‌సి కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉండగా 30నెలలు దాటినా పూర్తి కాలేదన్నారు.


ప్రభు త్వం ఉద్దేశ పూర్వకంగానే పీఆర్సీ కమిటీ నివేది క గడువును పెంచుతూ జీవో జారీ చేశార న్నారు.  సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లందరం కలిసి ఐక్య కార్యా చరణ కమిటీని ఏర్పాటు చేసుకున్నట్లు వారు తెలిపారు. జేఏసీ ఆద్వర్యంలో ముఖ్యంగా సీ పీవోను రద్దు చేసి పాతపెన్షన్‌ విధానం అమలు చేయాలని, వర్క్‌టు ఆర్డర్‌పై కేటాయించి ఉద్యో గులను వారి పూర్వ స్థలాలకు పంపించాలని డి మాండ్‌ చేశారు.  అర్హులైన ఉద్యోగులకు పదో న్నతులు కల్పించాలని, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ విధానాలను రద్దుచేసి అందరినీ రెగ్యులర్‌ చే యాలని కోరారు.  డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చేనెల 2, 3 4 తేలదీలలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, 5, 6 తేదీలలో భోజన విరా మంలో ఆయా కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని, 7వ తేదీ సాయం త్రం జిల్లా కేంధ్రంలో నిరసన ర్యాలీ చేపడతామని తమ కార్యాచరణ ప్రకటించారు. సమావేశంలో కో కన్వీనర్లు అశోక్‌కుమార్‌, రవిప్రసాద్‌, శ్రీనివాస్‌రావు, హరిప్రసాద్‌, బాల్‌రాజు, వెంకట్‌నారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-02-28T11:12:50+05:30 IST