17 నుంచి విత్తన వేరుశనగ పంపిణీ

ABN , First Publish Date - 2021-05-10T06:37:22+05:30 IST

జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో ఈనెల 17వతేదీ నుంచి ఖరీఫ్‌-2021 సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి మూడు విడతల్లో పం పిణీ చేయాలని నిర్ణయించారు. ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు తొలి విడత, ఈనెల 23 నుంచి 29 వరకు, 30వ తేదీ నుంచి మూడో విడత పంపిణీ చేపట్టనున్నారు.

17 నుంచి విత్తన వేరుశనగ పంపిణీ

మూడు విడతలుగా పంపిణీకి నిర్ణయం 

క్వింటా విత్తన వేరుశనగ 

పూర్తి ధర రూ.8680

40 శాతం సబ్సిడీ వర్తింపు

రైతు చెల్లించాల్సింది

క్వింటాల్‌పై రూ.5208

అనంతపురం వ్యవసాయం, మే 9: జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో ఈనెల 17వతేదీ నుంచి ఖరీఫ్‌-2021 సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈసారి మూడు విడతల్లో పం పిణీ చేయాలని నిర్ణయించారు. ఈనెల 17 నుంచి 22వ తేదీ వరకు తొలి విడత, ఈనెల 23 నుంచి 29 వరకు, 30వ తేదీ నుంచి మూడో విడత పంపిణీ చేపట్టనున్నారు. సబ్సిడీ విత్తన వేరుశనగ కావాల్సిన రైతుల పేర్ల నమోదు  ప్రక్రియ ఈనెల 10 నుంచి 16 వరకు తొలి విడత, 17 నుంచి 22 వరకు రెండో విడత, 23వ తేదీ నుంచి అవకాశం ఇచ్చారు. స్థానిక రైతు భరోసా కేంద్రాల్లోనే పేర్లు నమోదు చేసుకుంటారు.


రైతు వాటా క్వింటాల్‌పై రూ.5208

ఈ ఏడాది క్వింటా విత్తన వేరుశనగ పూర్తి ధర రూ.8680గా నిర్ణయించారు. ఇందులో 40 శాతం సబ్సిడీ రూ.3472 పోను రైతు వాటా కింద క్వింటాల్‌కు రూ.5208 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో రైతుకు గరిష్టంగా (బస్తా 30 కేజీలు) మూడు బస్తాలు పంపిణీ చేయనున్నారు. అర ఎకరా భూమి కలిగిన రైతులకు ఒక బస్తా (30 కేజీలు) పూర్తి ధర రూ.2604, ఇందులో సబ్సిడీ రూ.1042 పోను రైతువాటా కింద రూ.1562 చెల్లించాలి. ఎకరా విస్తీర్ణం వరకు 2 బస్తాలు (60 కేజీలు) పూర్తి ధర రూ.5208, ఇందులో సబ్సిడీ రూ.2083 పోను రైతు వాటా కింద రూ.3125 చెల్లించాలి. ఎకరాకుపైగా విస్తీర్ణం కలిగిన రైతులకు మూడు బస్తాలు (90 కేజీలు) పూర్తి ధర రూ.7812, ఇందులో సబ్సిడీ రూ.3125 పోను రైతువాటా రూ.4687 చెల్లించాల్సి ఉంటుంది. రైతులు ఒరిజినల్‌ పట్టాదారుపుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌తోపాటు సెల్‌ఫోన కూడా వెంట తీసుకురావాలని ఇనచార్జి జేడీఏ రామకృష్ణ సూచించారు. ప్రభుత్వ షెడ్యూల్‌ మేరకు షెడ్యూల్‌ తెగలు, కులాలకు చెందిన రైతులు, వెనుకబడిన తరగతులు, మైనార్టీ రైతులు, సన్న, చిన్నకారు రైతులకు తొలి ప్రాధాన్యతనిస్తామన్నారు. ఆ తర్వాత మిగతా రైతులకు విత్తన కాయలు పంపిణీ చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2021-05-10T06:37:22+05:30 IST