ఓటీఎస్‌తో ఎంతో మేలు

ABN , First Publish Date - 2021-12-08T04:47:04+05:30 IST

ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) చె ల్లింపులు వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ అన్నా రు

ఓటీఎస్‌తో ఎంతో మేలు
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌

జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ 

ముండ్లమూరు, డిసెంబరు 7: ఒన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌(ఓటీఎస్‌) చె ల్లింపులు వేగవంతం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌ అన్నా రు. దీనిపై మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, వీవోఏ లు, వలంటీర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మంగళవారం మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం గ్రామ సచివాలయంలో జరిగిన సభకు సర్పంచ్‌ వేముల పద్మావతి అధ్యక్షత వహించారు. జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటీఎస్‌తో లబ్ధిదారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రూ.10వేలు చెల్లిస్తే ఈనెల 21న శాశ్వత గృహ హక్కు కల్పిస్తామన్నారు. 1984 నుంచి రుణం తీసుకొని ఇళ్ళు కట్టుకున్న లబ్ధి దారులు, డీకే పట్టాల్లో గృహాలు నిర్మించుకున్న లబ్ధిదారులు త్వరితగతి న నగదు చెల్లిస్తే ఎటువంటి ఖర్చు లేకుండా శావ్వత రిజిస్ట్రేషన్‌ చేయి స్తామన్నారు. ఆతర్వాత సదరు గృహాలను అమ్ముకోవటానికి, బ్యాంకు లో పెట్టి రుణం తీసుకోవాలన్నా చెల్లుబాటు అవుతుందని చెప్పారు. 

రూ. పది వేలు ఎలా కట్టాలి..

ప్రస్తుతం పంటలకు పెట్టుబడి పెట్టాం అని కొందరు, మరికొందరు కూలికి వెళితే గాని కుటుంబాలు గడవవు, ఇలాంటి పరిస్థితుల్లో రూ 10వేలు ఎలా కట్టాలి చెప్పండంటూ గ్రామానికి చెందిన కొందరు లబ్ధి దారులు జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌కు మొర పెట్టుకున్నారు. రెండు నెలల పాటు పథకాన్ని పొడిగించాలని కోరారు. ఇది తమ చేతుల్లో లేదని, ప్రభుత్వ నిర్ణయమని జేసీ చెప్పారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ పి.పార్వతి, ఎంపీడీవో బి.చంద్రశేఖరరావు, హౌసింగ్‌ డీఈ శ్రీని వాసరావు, ఏఈ రమణ, ఏపీఎం సిమోను తదితరులు పాల్గొన్నారు. 

 రూ.10కే రిజిస్ర్టేషన్‌ సౌకర్యం

దొనకొండ, డిసెంబరు 7: జిల్లాలో 60 వేలమందికి త్వరలో కేవలం రూ.10కే రిజిస్టేషన్‌చేసి పూర్తి హక్కులు కల్పిస్తామని జాయింట్‌ కలెక్ట ర్‌ విశ్వనాథన్‌ చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం మం డలంలో ఏవిధంగా జరుగుతుంది, ఎటువంటి సమస్యలు ఎదురవు తున్నాయనే విషయాలను తెలుసుకునేందుకు దొనకొండ సచివాల యం-2లో లబ్ధిదారులతో, అధికారులతో మంగళవారం చర్చించారు.  అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ పథకం వల్ల  ఎన్నో ప్ర యోజనాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కె.వెంకటేశ్వర రావు, ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి పాల్గొన్నారు.

సిబ్బంది మధ్య లోపించిన సయోధ్య

కురిచేడు, డిసెంబరు 7: కురిచేడు మండలంలో సిబ్బంది మధ్య స యోధ్య లేకపోవడంతో ఓటీఎస్‌  లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారని జేసీ విశ్వనాథన్‌ ఆగ్రహం వ్యక్తం చేవారు. మంగళవారం బోదనంపాడు, కురిచేడు సచివాలయాలను ఆయన పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.  ఇప్పటికే ఓటీఎస్‌ కింద డబ్బులు కట్టిన వారికి రిజిస్ర్టేషన్‌ డా క్యుమెంట్లు ఇవ్వాలన్నారు. కురిచేడు-1, 2 సచివాలయాలకు రిజిస్ర్టేషన్‌ చేసే అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, బెల్లం చంద్రశేఖర రావు పాల్గొన్నారు. 

ఇంటి యజమానికి సంపూర్ణ హక్కు

తాళ్లూరు, డిసెంబరు 7: జగనన్న శాశ్వత గృహహక్కు పథకం ద్వా రా సంపూర్ణ హక్కు పొందాలని జేసీ విశ్వనాఽథన్‌ అన్నారు. మండలంలోని తాళ్లూరు, మల్కాపురం, విఠలాపురం, తురకపాలెం, మన్నేపల్లి గ్రామాల్లో మంగళవారం ఓటీఎస్‌పై అవగాహన సదస్సులు నిర్వహించారు. తాళ్లూరు, మల్కాపురం గ్రామాల్లో ఎంపీడీవో కేవీ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సదస్సుల్లో జేసీ మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో  వైసీపీ మండల ఇంచార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీని వాసరావు, జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ పి.బ్రహ్మయ్య, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T04:47:04+05:30 IST