Abn logo
Aug 5 2020 @ 12:42PM

సీతారాములను పూజించి.. రామాయణ పఠనంలో ఉపరాష్ట్రపతి దంపతులు

న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామాలయానికి భూమి పూజ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సతీసమేతంగా సీతారాములకు పూజలు చేశారు. అనంతరం రామాయణాన్ని పఠన ప్రారంభించారు. మరోవైపు అయోధ్యలో రామమందిరానికి ప్రధాని మోదీ భూమిపూజ చేస్తున్నారు. వేదమంత్రాల మధ్య భూమి పూజ వైభవోపేతంగా సాగుతోంది. యూపీ గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌భగవత్‌, రామజన్మభూమి ట్రస్ట్‌ చైర్మన్‌ గోపాల్‌ దాస్ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement
Advertisement