Delhi: మాతృభాష ప్రాధాన్యతకు మరిన్ని కాలేజీలు ముందుకు రావాలి: వెంకయ్య

ABN , First Publish Date - 2021-07-17T16:27:40+05:30 IST

నూతన విద్యాసంవత్సరం నుంచి కొన్ని ఇంజనీరింగ్ కోర్సులను మాతృభాషల్లో నిర్వహించేందుకు 8

Delhi: మాతృభాష ప్రాధాన్యతకు మరిన్ని కాలేజీలు ముందుకు రావాలి: వెంకయ్య

న్యూఢిల్లీ: నూతన విద్యాసంవత్సరం నుంచి కొన్ని ఇంజనీరింగ్ కోర్సులను మాతృభాషల్లో నిర్వహించేందుకు 8 రాష్ట్రాల్లోని 14 ఇంజనీరింగ్ కళాశాలలు ముందుకురావడం అభినందనీయమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మరిన్ని కాలేజీలు కూడా సాంకేతిక విద్యలో మాతృభాషకు ప్రాధాన్యత కల్పించేందుకు ముందుకు రావాలని వెంకయ్య ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా హిందీ, తెలుగు, మరాఠీ, తమిళ్, కన్నడ, గుజరాతీ, మలయాళం, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, ఒడియా వంటి 11 భారతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ కోర్సులను నిర్వహించేందుకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతించడం స్వాగతించదగిన పరిణామమని వెంకయ్య పేర్కొన్నారు. 

Updated Date - 2021-07-17T16:27:40+05:30 IST