ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: ఉపరాష్ట్రపతి

ABN , First Publish Date - 2021-10-28T21:51:34+05:30 IST

ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరమని ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు

ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరం: ఉపరాష్ట్రపతి

గోవా: ఉన్నత విద్యలో బహుముఖ విధానాలు అవసరమని ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.ఈ విషయాలే చదువుకోవాలనే నిర్బంధం ఇక ఉండదని అన్నారు. గురువారం గోవాలోని సంత్ సోహిరోబానాత్ ఆంబియే ప్రభుత్వ కళాశాల నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. బహుముఖ విధానాలను అమలుచేయడం వల్ల నచ్చిన విషయాలను నేర్చుకోవచ్చని అన్నారు. శాస్త్ర, సాంకేతికతతోపాటు మానవీయ విలువలకు కూడా సమానమైన ప్రాధాన్యత కల్పించాలన్నారు. 


వాణిజ్యం, ఆర్థిక రంగాల్లో ప్రపంచస్థాయి పరిశోధలను జరగాల్సిన అవసరం ఉందన్న ఉపరాష్ట్రపతి ఆధునిక ఐటీ పరికరాలతో సమానంగా ఓ సీతాకోక చిలుకల ఉద్యానవనానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రకృతిని ప్రేమించడం, సరైన ఆహారం – వ్యాయామం వంటి జీవన విధానాన్ని యువత అలవరచుకోవాలని ఉపరాష్ట్రపతి ఉద్భోదించారు.గోవా రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నవారిలో యువతుల సంఖ్య ఎక్కువగా ఉండటం పట్ల ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. సంప్రదాయ సంగీత కళాకారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Updated Date - 2021-10-28T21:51:34+05:30 IST