Abn logo
Oct 13 2021 @ 18:28PM

Viral Video: ఇది మామూలు కోడి పుంజు కాదు.. దీని అరుపు వింటే అమ్మో.. అంటారు..!

కోడి పుంజులకు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలుసు. ఇక పెందెం కోళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాటి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. వాటిని ప్రత్యేకంగా పెంచుతూ ఉంటారు. కోడి పందేలు నిర్వహించే సమయంలో వీటిని ఎగబడి మరీ కొంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కోడి పుంజును.. ఫ్రీగా ఇస్తామన్నా ఎవరూ తీసుకోరు. అదేంటి.. ఫ్రీగా వస్తుంటే కోడి పుంజును ఎవరన్నా కాదనుకుంటారా అని అనుమానం రావచ్చు. ఒక్కసారి దీని గురించి తెలిస్తే.. వామ్మో ఇదెక్కడి కోడిపుంజురా నాయనా అంటారు. ఇలాంటి కోడి పుంజు.. వీధికి ఒకటి ఉంటే, ఎవరూ ప్రశాంతంగా నిద్రపోరు మరి. దీని కర్ణకఠోర అరుపులు వింటే.. కోపం కట్టలు తెచ్చుకుంటుంది. వెంటనే దాన్ని చంపి కూర వండుకోవడమో.. లేక వదిలించుకోవడమో చేస్తారు. పొద్దున లేవాలంటే బద్ధకించే వారికి.. దీని అరుపు వినిపిస్తే వద్దన్నా లేచి కూర్చుంటారు. 

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కోడి పంజు వింత వింత అరుపులతో కూత కూస్తోంది. అది కూడా భయంకరమైన అరుపులతో సౌండ్స్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారు అవాక్కవుతున్నారు. ఇలాంటి కోడిపుంజు కూడా ఉంటుందా.. మరీ విచిత్రంగా ఉందే.. అంటున్నారు. ఇలాంటి కోడి పుంజులను ఒక్క నిమిషం కూడా ఇంట్లో పెట్టుకోమంటుంటే.. ఇంకొందరు, ఇది ఊర్లో ఉంటే చెవుల్లో దూదులు పెట్టుకోవాల్సిందే అని చమత్కరిస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...