Viral Video: ఈ జింకను చూసి మనుషులు చాలా నేర్చుకోవాలి.. ఎంత జాగ్రత్తగా రోడ్డు దాటుతుందో మీరే చూడండి..
ABN , First Publish Date - 2022-05-23T00:29:53+05:30 IST
రోడ్డు నిబంధనలు పాటించడంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారు ప్రమాదాలకు గురవడమే కాకుండా ఎదుటి వారికి కూడా హాని తలపెడుతుంటారు. కొందరు యువకులైతే ఫుల్‌గా మందు తాగి..
రోడ్డు నిబంధనలు పాటించడంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారు ప్రమాదాలకు గురవడమే కాకుండా ఎదుటి వారికి కూడా హాని తలపెడుతుంటారు. కొందరు యువకులైతే ఫుల్‌గా మందు తాగి వాహనాలతో రోడ్డు మీదకు వస్తుంటారు. ముందు, వెనుక చూసుకోకుండా వాహనాలను నడుపుతుంటారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ జింక ఎంతో జాగ్రత్తగా రోడ్డు దాటడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సెంట్రల్ జపాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యూపీ పోలీసులు.. తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఇది డీర్ జిందగీ.. అని ట్యాగ్ చేస్తూ షేర్ చేసిన ఈ వీడియోలో ఓ జింక.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రోడ్డు దాటేందుకు వీలుగా జీబ్రా క్రాసింగ్ లైన్ ఏర్పాటు చేయడం తెలిసిందే. అయితే చాలా మంది ఈ నిబంధనలు పాటించకుండా ఎలాపడితే అలా రోడ్డు దాటుతూ ప్రమాదాలకు గురవుతుంటారు.
83 ఏళ్ల వయసులో కూడా ఈ బామ్మ.. ఎంత సులభంగా బరువు ఎత్తుతుందో మీరే చూడండి..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ జింక.. నన్ను చూసి నేర్చుకోండి.. అని సందేశం ఇస్తున్నట్లుగా వాహనాలను గమనిస్తూ, జీబ్రా లైన్ మీదుగా రోడ్డు దాటుతుంది. ఆ సమయంలో జింకను చూసిన వాహనదారులు కూడా అవాక్కవుతారు. ఈ వీడియోను షేర్ చేసిన యూపీ పోలీసులు.. రోడ్డు నిబంధనలు పాటించండి అంటూ ప్రజలకు సూచించారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.