లోకల్ ట్రైన్‌లో గుర్రం ప్రత్యక్షం.. అవాక్కైన ప్రయాణికులు.. ఫొటో వైరల్ కావడంతో చివరకు షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2022-04-09T16:39:59+05:30 IST

కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకున్న సమయంలో ఆశ్చర్యంతో పాటూ అవాక్కవుతూ ఉంటాం. రోటీన్‌కి భిన్నంగా ఏం జరిగినా సోషల్ మీడియాలో ఇట్టే తెలిసిపోతుంటుంది. ప్రస్తుతం లోకల్..

లోకల్ ట్రైన్‌లో గుర్రం ప్రత్యక్షం.. అవాక్కైన ప్రయాణికులు.. ఫొటో వైరల్ కావడంతో చివరకు షాకింగ్ ట్విస్ట్..!

కొన్నిసార్లు అనూహ్య ఘటనలు చోటు చేసుకున్న సమయంలో ఆశ్చర్యంతో పాటూ అవాక్కవుతూ ఉంటాం. రోటీన్‌కి భిన్నంగా ఏం జరిగినా సోషల్ మీడియాలో ఇట్టే తెలిసిపోతుంటుంది. ప్రస్తుతం లోకల్ ట్రైన్‌లో గుర్రం ప్రత్యక్షమైన వీడియో వైరల్ అవుతోంది.  ట్రైన్‌లో మనుషులు, లగేజీ ఉండడం చూశాం గానీ.. గుర్రాలు ప్రత్యక్షమవడం ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా. మీరే కాదు ఆ రైల్లోని ప్రయాణికులంతా ఇలాగే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. 


పశ్చిమ బెంగాల్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. గఫూర్ అలీ మొల్లా అనే వ్యక్తి.. గుర్రపు పందెం ముగించుకుని బుధవారం రాత్రి తిరిగి ఇంటికి బయలుదేరాడు. తూర్పు రైల్వేలోని సీల్దా డివిజన్‌లో రద్దీగా ఉండే డైమండ్ హార్బర్ లోకల్‌ ట్రైన్‌లో తన గుర్రాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మిస్టర్ మొల్లా సీల్దా సౌత్ బ్రాంచ్‌లోని దక్షిణ్ దుర్గాపూర్ స్టేషన్‌లో లోకల్ రైలు ఎక్కాడు. గుర్రంతో ఎక్కగానే లోపల ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వారిలో కొందరు గుర్రం యజమానిని నిలదీశారు. ఇందేటి! గుర్రాన్ని ఇలా తీసుకెళ్లడం నేరం.. అని వారించినా అతడు మాత్రం వినిపించుకోలేదు. 23 కిలోమీటర్లు ప్రయాణించి.. ఎనిమిది స్టేషన్ల తర్వాత నేత్రే స్టేషన్‌లో దిగాడు.

పరీక్షలంటే భయమేసి.. ప్రియుడిని పిలిచి పారిపోదామని చెప్పింది.. అయితే దారి మధ్యలో అతడు ప్లాన్ మార్చడంతో...


ట్రైన్‌లో గుర్రం ఉన్న సమయంలో కొందరు ఫొటోలు తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయం రైల్వే అధికారుల వరకు వెళ్లింది. ప్యాసింజర్ రైళ్లలో ఎలాంటి జంతువులను తీసుకెళ్లకూడదని  తూర్పు రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ ఏకలవ్య చక్రవర్తి తెలిపారు. కొన్ని నిబంధనలను అనుసరించి తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. పిల్లులు, కుక్కలు వంటి జంతువులను ఫస్ట్ క్లాస్‌ ఏసీలో మాత్రమే తీసుకెళ్లేందుకు వీలుందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన గుర్రం యజమానిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

పాయసం తిన్న పిల్లలు కాసేపటికే ఆస్పత్రిలో చేరిక.. చివరగా తల్లి చేసిన పని తెలుసుకుని అంతా షాక్..





Updated Date - 2022-04-09T16:39:59+05:30 IST